
ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నప్పటికీ సిఎం జగన్, ఎంపీ విజయ సాయిరెడ్డి ఇద్దరూ మోడీ, అమిత్ షాలకు వీరవిధేయంగా మెలుగుతూ నాలుగున్నరేళ్ళు నెట్టుకొచ్చేశారు. ఢిల్లీ పెద్దలకు విధేయంగా ఉంటూనే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అవహేళన చేస్తుంటారు. ఆమె చంద్రబాబు నాయుడు అరెస్టుని ఖండించడమే అందుకు కారణం.
ఇప్పుడు ఏపీ బీజేపీలో చిచ్చు పెట్టి ఆమెను ఆ పదవి నుంచి తప్పించేందుకు కూడా ప్రయత్నిస్తుండటం చూస్తే వైసీపి తెగువకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏపీ బీజేపీలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలను ఇందుకు ఉసిగొల్పుతోంది. రాయలసీమకు చెందిన బీజేపీ నేత ఏవీ సుబ్బారెడ్డి దగ్గుబాటి పురందేశ్వరిపై తీవ్ర విమర్శలు చేయడమే ఇందుకు తాజా నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
‘దగ్గుబాటి పురందేశ్వరి తీరు పట్ల పార్టీలో నేతలు అసంతృప్తిగా ఉన్నారని, రాష్ట్రంలో టిడిపి బలహీనపడినప్పుడు ఆమె బీజేపీని బలోపేతం చేసుకొనేందుకు ప్రయత్నించకుండా చంద్రబాబు నాయుడుని, టిడిపిని కాపాడేందుకు తెర వెనుక ప్రయత్నాలు చేస్తుండటాన్ని బీజేపీలో ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారని, కనుక ఆమెను ఆ పదవిలో నుంచి తప్పిస్తే మంచిదని వారు భావిస్తున్నారంటూ వైసీపి అనుకూల మీడియాలో కధనాలు వస్తున్నాయి.
ఆమె చంద్రబాబు నాయుడు అరెస్టుని ఖండించిన తర్వాత, సాక్షి మీడియా, ఎంపీ విజయ సాయిరెడ్డి సరిగ్గా ఇవే వాదనలు వినిపించారు. ఇప్పుడు అవే వాదనలు వైసీపి అనుకూల మీడియాలో కూడా వినిపిస్తుండటం గమనిస్తే, ఏపీ బీజేపీలో చిచ్చు పెట్టి ఆమెను ఆ పదవిలో నుంచి తప్పించేందుకు వైసీపి తెర వెనుక గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్లు అర్దమవుతోంది. ఆమెను తప్పించగలిగితే వైసీపి పట్ల సానుకూలంగా వ్యవహరించే నేతలెవరినైనా ఆ పదవిలో నియమించేలా చేయాలని వైసీపి భావిస్తున్నట్లుంది.
ఎన్నికలలోగా టిడిపిని చావుదెబ్బ తీసేందుకు వైసీపి చేస్తున్న ప్రయత్నాలను అందరూ చూస్తూనే ఉన్నారు. ఏపీలో పెద్దగా బలపడలేకపోయిన బీజేపీని, దగ్గుబాటి పురందేశ్వరిని చూసి వైసీపి ఎందుకు భయపడుతోంది?అంటే బహుశః ఆమె బీజేపీని టిడిపి, జనసేనలతో పొత్తుకి ఒప్పించేస్తారేమో అనే భయం వల్లనే కావచ్చు.
ఇదివరకు టిడిపి, జనసేనలు ఎక్కడ కలిసిపోతాయో అని వైసీపి ఆందోళన చెందింది. ఇప్పుడు వాటితో బీజేపీ కలిసిపోతుందేమో అని ఆందోళన చెందుతున్నట్లుంది. ప్రతిపక్షాలన్నీ కట్టకట్టుకొని వచ్చినా సింహం సింగిల్‌గానే వాటిని ఎదుర్కొంటుందని ప్రగల్భాలు పలుకుతున్నప్పుడు, మళ్ళీ ఈ కుట్రలు, కుతంత్రాలు ఎందుకో?
Rajinikanth's most anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set for a…
Vijay’s rise to power in Tamil Nadu has once again brought the spotlight on actors…