నేరం వైసీపీ ది…శిక్ష టీడీపీ కా..? ఇంకెన్నాళ్లు..?

ప్రతి అంశాన్ని తన రాజకీయ అవకాశంగా మార్చుకోవడంలో నేర్పరి అయిన జగన్ ఇప్పుడు కూడా అదే తరహాలో ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న పింఛన్ల పంచాయితిని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో ఎంతో మంది వృద్ధుల, వికలాంగుల జీవితాలను పణంగా పెట్టడానికి సిద్ధమయ్యారు వైస్ జగన్. సంస్థాగతంగా బలమైన కార్యకర్తలు ఉన్న టీడీపీ పార్టీ కూడా వైసీపీ చేస్తున్న తప్పుడు ఆరోపణలను తిప్పికొట్టలేకపోవడం ప్రత్యర్థికి అనుకోని బలాన్ని తెచ్చిపెడుతుంది.

రాజకీయంగా టీడీపీ ని దెబ్బకొట్టాలనే ఉద్దేశంతో ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను చంద్రబాబు ఖాతాలో వేసి దానిని తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు జగన్. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో పింఛన్ల పంపణీలో వాలంటీర్ సేవలను నిలుపుదల చేయాలి అంటూ ఈసీ ఇచ్చిన ఆదేశాలతో పింఛన్ల పంపిణీని అటకెక్కించిన అధికార పార్టీ ఆ నేరాన్ని టీడీపీ పై నెట్టేస్తుంది.

ADVERTISEMENT

చంద్రబాబు ప్రోద్బలంతోనే ఈ పింఛన్ల పంపిణి ఆగి పోయిందని, రేపు వచ్చే ఎన్నికలలో టీడీపీ కూటమి విజయం సాధిస్తే ఇక పింఛన్ అందుకుంటున్న అవ్వాతాతల పరిస్థితి ఇలానే ఉంటుందంటూ అమాయక ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు జగన్. ప్రతి నెల ఒకటో తేదీనే మీ ఇంటికి వచ్చి పింఛన్ అందించే వాలంటీర్లను మీ ఇళ్లకు రాకుండా చేసి మిమ్మల్ని పిన్షన్ కోసం మండే ఎండలలో రోడ్ల మీదకు తెచ్చిన పాపం బాబుదే అంటూ మేమంతా సిద్ధం సభలలో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు జగన్.

నిన్నా, ఈరోజు లో పిన్షన్ కోసం సచివాలయంకు వచ్చిన వృద్దులలో ఒకరిద్దరు వడదెబ్బ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీనితో ఇక శవరాజకీయాలు మొదలుపెట్టారు వైసీపీ నేతలు. ఒక పక్క సచివాలయ సిబ్బంది సహకారంతో వృద్దులకు, వికలాంగులకు ఇంటి వద్దకే పిన్షన్ పంపిణి చేయాలంటూ అటు ఈసీ, ఇటు కూటమి పార్టీల నేతలు అధికార పార్టీని హెచ్చరిస్తున్న కేవలం వారి రాజకీయ స్వప్రయోజనాల కోసం పిన్షన్ పంపిణిని అడ్డుకుంటూ ఆ నేరం మొత్తం బాబు పై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు.

సినిమా హాళ్ళో, మద్యం షాపుల ముందు డ్యూటీలకు ఉన్న ఉద్యోగులు పిన్షన్ ఇవ్వడానికి లేరా..? అంటూ జనసేన అధినేత పవన్ ప్రశ్నిస్తున్నా, పిన్షన్ కోసం ఎదురుచూస్తున్న నడవలేని వారిని సచివాలయాలకు తీసుకువెళ్లి పిన్షన్ ఇప్పించి తిరిగి ఇంటికి జాగ్రత్తా చేర్చండి అంటూ పార్టీ క్యాడర్ పిలుపునిచ్చిన ఇవేమి పట్టని వైసీపీ తానూ చేస్తున్న నేరాన్ని టీడీపీ కూటమి మీద నెట్టేస్తుంది.

అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా తన ప్రజాగళంలో వైసీపీ చేస్తున్న పిన్షన్ రాజకీయాన్ని ప్రజలకు వివరిస్తున్నారు. తానూ వాలంటీర్ వ్యవస్థకు వ్యతిరేకం కాదు కేవలం వారు చేస్తున్న రాజకీయానికి మాత్రమే వ్యతిరేకిని. పిన్షన్ పంపిణి నేరం మాది కాదు రాష్ట్ర ఖజానా ను ఖాళీ చేసి ఆ నేరం మా పైన వెయ్యాలని జగన్ ప్రయత్నిస్తున్నారని, దీనిని తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి టీడీపీ కార్యకర్త మీద ఉందంటూ టీడీపీ క్యాడర్ కు పిలుపునిచ్చారు బాబు.

ఇలా తన రాజకీయ అవసరాల కోసం, ప్రత్యర్థులను దెబ్బతీయడం కోసం జగన్ ఆడుతున్న ఈ రాజకీయ చదరంగంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు బాధ్యత వహించేదెవరు..? వారి నిండు ప్రాణాలు ఒక రాజకీయ పార్టీ అధికారం కోసం ఆడే ఆటకు పునాదులు కావాల్సిందేనా..? ఇప్పటికే నా తండ్రి చావుతో వచ్చిన రక్తంతో వైసీపీ పునాదులు తడిచాయి అంటూ వివేకా కుమార్తె సునీతా జగన్ పై విరుచుకుపడుతున్నారు.

‘వైస్సార్ చావుతో ఊపిరి పోసుకున్న వైసీపీ వివేకా చావుతో అధికారం అందిపుచ్చుకుంది’. ఇప్పుడు మరో ఛాన్స్ కోసం రాష్ట్రంలో ఎంతమంది వృద్ధుల, వికలాంగుల చావులు కోరుకుంటున్నారు ఈ వైసీపీ నేతలు అంటూ సోషల్ మీడియాలో వైసీపీ ప్రభుత్వం పై కౌంటర్లు పేలుతున్నాయి. నేరం మీరు చేసి శిక్ష టీడీపీ ని అనుభవించమంటారా..? గత ఎన్నికలలో నారాసుర రక్త చరిత్ర అన్నారు…ఇప్పుడు బాబు పశుపతి అంటున్నారు.

ఇలా ప్రతిసారి వైసీపీ హత్య రాజకీయాల రక్తపు మరకలకు పసుపు రంగు పూయాలనుకోవడం జగన్ అండ్ కో కు పరిపాటిగా మారిందనే చెప్పాలి. కనీసం వైసీపీ అంటిస్తున్న ఈ రక్తపు మరకలనైనా టీడీపీ తుడుచుకోలేక పొతే వైసీపీ చేసిన నేరానికి టీడీపీ శిక్ష అనుభవించక తప్పని పరిస్థితి రావచ్చు. ‘చేతులు కాలాక ఆకులూ పట్టుకోవడం కాదు…చేతులు కాలకుండా చూసుకోవాల్సిన బాధ్యత’ టీడీపీ పైనే ఉందనేది గ్రహించాలి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

Ranabaali US: Advance Sales & Breakeven Target No Sync

Vijay Deverakonda’s Ranabaali is heading towards release with a big overseas target, but the early…

6 hours ago

AK47 New Date: Trivikram About to Break His Promise?

After missing its October 9 release, Venkatesh and Trivikram’s Aadarsha Kutumbam AK47 was reportedly heading…

7 hours ago