
రాజకీయంగా బిఆర్ఎస్ కు వైసీపీ కన్నా ఎక్కువ అనుభవం ఉన్నప్పటికీ కొన్ని కొన్ని అంశాలలో బిఆర్ఎస్ వైసీపీ నే ఫాలో అవడం గహనార్హం. వైసీపీలో తల్లిని అధికారికంగా రాజీనామా చేయించి ఇంటికి పంపిస్తే బిఆర్ఎస్ లో అనధికారికంగా కేసీఆర్ ను ఫామ్ హౌస్ కి పరిమితం చేసారు.
అలాగే వైసీపీ చెల్లి షర్మిల తో వైరం పెట్టుకుంటే ఇక్కడ బిఆర్ఎస్ కవిత తో కయ్యానికి కాలు దూస్తుంది. ఇక అక్కడ వైసీపీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేయడానికి బాబును అడ్డుపెట్టుకుని పవన్ బాబుకి దత్తపుత్రుడు అంటూ విమర్శలకు దిగుతుంది.
సేమ్ టూ సేమ్ ఇక్కడ బిఆర్ఎస్ కూడా అదే తరహాలో తమ ప్రత్యర్థి నాయకుడైన కాంగ్రెస్ నేత, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేయానికి మధ్యలో వారధిగా ఏపీ ముఖ్యమంత్రి బాబుని వాడుకుంటుంది.
రేవంత్ తన గురువు బాబు కి గురు దక్షణ ఇచ్చేందుకే బనకచర్ల విషయంలో మౌనంగా ఉన్నారు, బాబుకి గురు దక్షణ ఇవ్వడానికే మొన్న జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికలలో కాంగ్రెస్ నేతలతో రేవంత్ ఎన్డీయే అభ్యర్థికి ఓటేయించారు, రేవంత్ ప్రభుత్వం బాబు కనుసన్నలలో నడుస్తుంది అంటూ ప్రతి అంశంలోనూ రేవంత్ పై రాజకీయ దాడి చేయడానికి గురు శిష్యుల కాన్సెప్ట్ ను ముందుంచుతారు.
అలాగే జగన్ కు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఎం జరిగిన అందుకు కారణం చంద్రబాబే అంటూ మండిపడుతుంది వైసీపీ. ఇక ఇక్కడ తెలంగాణలో బిఆర్ఎస్ ఉనికికి ఎటువంటి ప్రమాదం ఎదురైనా అందుకు దోషిగా టీడీపీ నే ఫ్రేమ్ లోకి తెస్తుంది బిఆర్ఎస్.
ఇక రెండు పార్టీలు ఈటీవీ, ABN , టీవీ 5 లను తమ రాజకీయ ప్రత్యర్థులుగా భావిస్తూ వీటికి పచ్చ మీడియా అనే టాగ్ వేస్తాయి. దీని బట్టి చూస్తే ఏపీలో వైసీపీ తెలంగాణలో బిఆర్ఎస్ రెండు ఒకే దారిలో రాజకీయ ప్రయాణం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అలాగే ఈ రెండు పార్టీలకు కాంగ్రెస్ – జనసేనలు ద్వితీయ ప్రత్యర్థులుగా ఉంటే టీడీపీ మాత్రం ప్రధమ ప్రత్యర్థి గా కొనసాగుతుంది.
అయితే అసలు వైసీపీ – బిఆర్ఎస్ టీడీపీ ని ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేయడానికి అసలు కారణం ఏమైఉంటుందో.? నీలి ఫ్యాన్ కి గులాబీ కారుకి పసుపు సైకిల్ అంటే అంత ద్వేషం రావడనికి కారణం ఏమిటో.? టీడీపీ అంటే భయమా.? బాబు అంటే అసూయా.?
లేక టీడీపీ లేని రాజకీయం బాబు లేని రాజకీయ విమర్శ ఈ రెండు పార్టీలు కొనసాగించలేవా.? అందుకే వైసీపీ దత్తపుత్రుడు అనే నినాదాన్ని ఎత్తుకుందా.? బిఆర్ఎస్ గురు శిష్యులు అనే వాదాన్ని నమ్ముకుందా.?
In a massive celebration of Telugu pride, Telangana Chief Minister A. Revanth Reddy formally unveiled…
Indian professionals in the United States are facing growing uncertainty due to new USCIS policies…