ఏం సాధించాలని బొత్స చేత కూడా చెప్పిస్తున్నారంటే…

ఈ ఐదేళ్ళలో వైసీపి అరాచకాలు, వేధింపులను టిడిపి, జనసేనలు చాలా ఓర్పుగా భరించాయి. కానీ మరో 10 రోజులలో ఎన్నికల ఫలితాలు రాబోతున్నా, వాటిలో వైసీపి ఓడిపోయే అవకాశాలు కనిపిస్తున్నా ఇంకా వైసీపి నేతల నోరు జోరు ఏమాత్రం తగ్గడం లేదు. ఇంకా చంద్రబాబు నాయుడుని నిందిస్తూనే ఉన్నారు.

ADVERTISEMENT

రాష్ట్రంలో జరిగిన అల్లర్లన్నిటికీ చంద్రబాబు నాయుడే కారణమంటూ వైసీపి నేతలందరూ ఒకటే పాట పాడుతున్నారు. కేంద్ర ఎన్నికల కమీషన్‌ కూడా చాలా పక్షపాతంగా వ్యవహరిస్తోందని, పోలీస్ అధికారులు కూడా చంద్రబాబు నాయుడుకి తొత్తుల్లా మారి తమపై టిడిపి శ్రేణులు దాడులు చేస్తుంటే చూస్తూ ఊరుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. జూన్ 9న జగన్‌ విశాఖలో రెండో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని బొత్స సత్యనారాయణ అన్నారు.

మంత్రులు అంబటి రాంబాబు, రోజా లేదా ఎమ్మెల్యే కొడాలి నాని వంటివారు ఈవిదంగా మాట్లాడితే అర్దం చేసుకోవచ్చు. కానీ ఇంచుమించు చంద్రబాబు నాయుడుతో సమాన రాజకీయ అనుభవం కలిగిన మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఈవిదంగా ఆరోపణలు చేయడం, ప్రమాణస్వీకారం అంటూ మాట్లాడుతుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఇంతకాలం ఆయన చాలా ఆచితూచి మాట్లాడుతూ భవిష్యత్‌లో తనకు రాజకీయంగా ఎవరి వలన ఇబ్బంది లేకుండా జాగ్రత్తపడ్డారు. కానీ ఆయన కూడా ఇప్పుడు ఈవిదంగా మాట్లాడుతున్నారంటే నమ్మశఖ్యంగా లేదు.

బహుశః ఆయన వంటి సీనియర్ చేత ఈవిదంగా చంద్రబాబు నాయుడు మీద ఆరోపణలు చేయిస్తూ, ప్రమాణస్వీకారమని చెప్పిస్తే ప్రజలకు తమపై నమ్మకం కలుగుతుందని జగన్‌ భావిస్తున్నట్లున్నారు.

కానీ 5 ఏళ్ళలో ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసి, పోలింగ్‌ కూడా పూర్తయిన తర్వాత ఇప్పుడు ప్రజలకు నమ్మకం కలిగించి ఏం ప్రయోజనం?

అసలు చంద్రబాబు నాయుడే రాష్ట్రంలో అల్లర్లు చేయించారనే ఆరోపణ చేయాలనే ఈ ఆలోచన వైసీపిలో జగన్, సజ్జల, ఐప్యాక్ ఎవరికి వచ్చిందో కానీ, ఈ విదంగా వాదిస్తూ వారు తమ ఓటమికి ముందే కుంటి సాకులు సిద్దం చేసుకొంటున్నారని సామాన్య ప్రజలకు కూడా గ్రహించారు.

ఎన్నికల ఫలితాలు వెలువడుతునప్పుడు విశాఖలో ప్రమాణ స్వీకారం అని చెప్పుకున్నా నమ్మశక్యంగా ఉండేది కానీ ఓడిపోబోతున్నామని తెలిసి కూడా ఇంకా ‘విశాఖలో ప్రమాణ స్వీకారం’ అంటూ డ్రామాలు చేస్తూ వైసీపిలో అందరూ కలిసి జగన్‌ పరువు, తమ పరువు తీసేసుకొంటున్నారు. ఇన్ని మాటలు మాట్లాడి రేపు ఓడిపోతే వైసీపిలో ఎవరైనా ప్రజలకు మొహం చూపించగలరా? ఇన్నేళ్ళు జగన్‌ మాట విని చివరికి ఈ దుస్థితికి చేరుకుంటున్నారు. ఇంకా జగన్‌ కోసం ఆరాటం అవసరమా?ఇప్పటికైనా ఆలోచించుకుంటే మంచిది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

స్థానికంలో మచ్చుకి కొన్ని ఆలోచనలు, అభిప్రాయాలు…

స్థానిక సంస్థల ఎన్నికలలో సీట్ల సర్దుబాట్ల విషయంలో సోషల్ మీడియాలో ఇరు వర్గాల మద్దతుదారులు చేస్తున్న వ్యాఖ్యలు చాలా ఆసక్తికరంగా…

7 minutes ago

దసరాకు కాదు.. సంక్రాంతికి రిలీజ్‌!

ఇది సినిమా రిలీజ్‌.. వాయిదా పడటం గురించి కాదు. మాజీ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కొత్త పార్టీ రిలీజ్‌…

8 minutes ago