
దేశంలో ఎక్కడ లేని బూమ్ బూమ్,ప్రెసిడెంట్ మెడల్, స్పెషల్ స్టేటస్ ఇలా జగన్ తానూ రాష్ట్రానికి తేలేకపోయిన కేంద్ర ప్రభుత్వ పథకాలను ఈ మద్యం బ్రాండ్లతో సరిపెట్టినట్టున్నారు. విషయానికి వస్తే ఇటువంటి నాణ్యత లేని మద్యం సేవించడం వలన ఎన్నో కుటుంబాలు ఇంటి పెద్ద దిక్కుని కోల్పోయి రోడ్డున పడుతున్నాయి. ప్రజల ప్రాణాలను హరించే ఈమద్యం బ్రాండ్లను వెంటనే రద్దు చేయాలనీ ప్రతిపక్షాలు – మందు ప్రియులు ప్రభుత్వాన్ని కోరినప్పటికీ ఫలితం మాత్రం శూన్యం.
ఈ మందు సేవించడం వలన అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని టీడీపీ ఆధారాలతో నిరూపించిన ప్రభుత్వంలో చలనం లేదు. పైగా ఇవి టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన అనుమతులు అంటూ వైసీపీ చేస్తున్న వితండవాదన హాస్యాస్పదంగా ఉందనే చెప్పాలి.
ఏ ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా అవి ప్రజల ప్రాణాలకు హానికరం అనుకుంటే వాటిని వెంటనే రద్దు చేయాలి కదా? వైసీపీ వాదనే నిజమని భావించిన అనుమతి ఇచ్చిన వారే వ్యతిరేకిస్తున్నారు కదా!
గత ప్రభుత్వం తాలూకా ఆనవాళ్లను కూడా రాష్ట్ర ప్రజల మనస్సు లో ఉంచకూడదు అనే భావనతోనేగా ప్రజా వేదికను కూల్చి రాజధాని అమరావతిని కాలరాసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అన్ని కార్యక్రమాలను అటకెక్కించిన జగన్ ఈ మద్యం బ్రాండ్ల విషయంలో మాత్రమే టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన అనుమతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అంటేనే అర్ధమవుతుంది ఆ బ్రాండ్లు ఎవరి జేబులు నింపుతున్నాయి అనేది.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వ నిర్ణయాలైనా రాజధానిని మార్చారు, ఇసుక పాలసీ,లిక్కర్ పాలసీ, మైనింగ్ పాలసీ,రోడ్డు మరమత్తుల కాంట్రాక్టర్ల మొదలు, పోలవరం టెండర్ల మార్పు వరకు…,ఇలా పత్రిది మార్పు – చేర్పులతో “మార్పు మంచితే” అంటూ ముందుకెళ్లిన జగన్ ఈ ఒక్క విషయంలోనే ఎందుకు మార్పులు చేయడం లేదో? అనుమతులు గత ప్రభుత్వం ఇచ్చింది అంటున్నారే కానీ వాటిలో నాణ్యత ఉంది అని మాత్రం ప్రభుత్వ పెద్దలు చెప్పలేక పోవడం పలు అనుమానాలకు తావిస్తుంది.
చంద్రబాబు ఆమోద ముద్ర పడ్డ ఏఒక్కదానికి జగన్ ప్రభుత్వంలో అనుమతి దక్కలేదనే చెప్పాలి. ఇక్కడ కూడా మద్యం బ్రాండ్లలో హానికరమైన రసాయనాలు కలుస్తున్నాయి అంటూ పత్రికలు రాసే కథనాలనే తప్పు పడుతున్న వైసీపీ సోషల్ మీడియా తమ ప్రభుత్వ విధానంలో తప్పులేదు అని నిర్దారించలేకపోవడం కొసమెరుపు.
India beat West Indies by 14 runs in the third T20I at the Holkar Stadium…
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…