
రాజకీయాలలో వైసీపీ నేతల రాజకీయాలు వేరయా అనేలా వారి విధానాలు కొనసాగుతూ ఉంటాయి. కావాలని చేస్తున్నారో…యాధృచ్ఛికంగా జరుగుతున్నాయో కానీ ప్రతిసారి ఎన్నికల ముందు వైస్ జగన్ పై అనుకోని దాడి జరగడం దానికి కారణం బాబే అనడం నమ్మడానికి కాస్త కష్టంగా ఉన్నప్పటికీ నమ్మించడానికి వైసీపీ సర్వ శక్తులు ఒడ్డుతుంది.
గత ఎన్నికలో జగన్ పైన జరిగిన విశాఖ కోడికత్తి సంఘటన, వివేకా హత్య ఉదంతం కు గాను అప్పటి డిజిపి, ఇంటెలిజెన్స్ డీజీ పై చర్యలు తీసుకుని వారిని విధుల నుంచి తపించింది ఈసీ. సరిగ్గా ఐదేళ్ల తరువాత మళ్ళీ ఎన్నికల ముందు విజయవాడలో జగన్ పై గులక రాయి దాడి జరిగింది. మళ్ళీ అదే స్క్రిప్ట్ ఫాలో అయ్యారు వైకాపా నేతలు. ఈ దాడికి కూడా చంద్రబాబే కారణమంటూ మళ్ళీ రాజకీయం మొదలుపెట్టింది వైసీపీ.
అయితే ఈ సారి వైసీపీ నేతల రాజకీయం వారి వేలితో వారి కన్నే పొడుచుకునేలా ఉండడం ఎవరి స్క్రిప్టులో భాగమో కానీ అది వైసీపీ కి పెద్ద ఎదురు దెబ్బగానే భావించాలి. ఇదే కేసును సాకుగా చూపి అటు ప్రతిపక్షాలు కూడా ముఖ్యమంత్రి భద్రతా పై నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను రాష్ట్ర డీజీపీ, విజయవాడ సీపీ, ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ పై చర్యలు తీసుకోవాలంటూ ఈసీకి లేఖాస్త్రాలు సంధించారు టీడీపీ, జనసేన పార్టీల నేతలు.
అయితే వీరి మాటలను తక్కువంచన వేసిన వైసీపీ అదే పనిగా జగన్ పై హత్యాయత్నం అంటూ కథనాలు ప్రచారం చేయడంతో ఇక చర్యలకు ఆదేశించింది ఈసీ. ఇందులో భాగంగా విజయవాడ సీపీ, ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ పై చర్యలు తీసుకుంది ఈసీ. వారిని ఎన్నికల విధుల నుండి తప్పించి వారి స్థానంలో ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ గా కుమార్ విజ్వజిత్ ను, విజయవాడ సీపీ గా పిహెచ్డీ రామకృష్ణ ను నియమించింది.
ఈ ఊహించని పరిణామాలతో కంగుతిన్న వైసీపీ గులకరాయి దాడిని హైలెట్ చేసి తప్పు చేసేమేమో అనే భావనకు వచ్చినట్లు తెలుస్తుంది. దీనితో వైసీపీ తన వేలుతో తన కన్నే పొడుచుకున్నట్లయ్యింది అంటున్నారు కూటమి నాయకులు. వ్యవస్థలు ఎప్పుడు ఒకరి చేతిలోనే బందీగా ఉండవనేది వైసీపీ ఇప్పటికైనా గ్రహించాలి.
Vijay Deverakonda’s Ranabaali is heading towards release with a big overseas target, but the early…
After missing its October 9 release, Venkatesh and Trivikram’s Aadarsha Kutumbam AK47 was reportedly heading…