
ఈసారి ఏపీ ఎన్నికలు అటు ఏపీ ప్రజలతో పాటు ఇటు సినీ ఇండస్ట్రీ కి కూడా జీవన్మరణ సమస్యే కానుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సినీ ఇండస్ట్రీ పట్ల, ఆ ఇండస్ట్రీ పెద్దల పట్ల వైసీపీ ప్రభుత్వం ప్రవర్తించిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. మేము సినీ రంగానికి సంబంధించిన వ్యక్తులం మాకు రాజకీయాలతో సంబంధం లేదు అనుకున్న వారికి సైతం రాజకీయం రుచి చూపించారు జగన్.
సినిమా టికెట్ల ధరల తగ్గింపుతో మొదలైన సినీ ఇండస్ట్రీ పంచాయితీ కొన్ని నెలల పాటు నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. ఇండస్ట్రీ పెద్దలు అని చెప్పుకోబడే నటుల నుండి దర్శకుల వరకు తాడేపల్లి జగన్ ప్యాలస్ వద్ద మోకరిల్లాల్సి వచ్చింది. దర్శకధీరుడు
అంటూ తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన రాజమౌళి నుంచి మెగా స్టార్ చిరంజీవి, బాహుబలి ప్రభాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి అగ్ర నటీనటులు కూడా జగన్ దగ్గర చేతులు చాచాల్సిన పరిస్థితి వచ్చింది.
సామాన్యుడికి అందుబాటులో వినోదం అంటూ మొదలుపెట్టిన జగన్ సినీ రాజకీయం కు ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా కుదేలయ్యిపోయింది. అయినా పవన్ మినహా ఎవ్వరు వైసీపీ ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా గొంతెత్తే ధైర్యం చేయలేకపోయారు. ధైర్యం చేసి ఒకరిద్దరు ముందుకొచ్చి పవన్ కు మద్దతుగా ప్రకటన చేసిన దానికి పర్యవసానంగా ఆయా నటుల సినిమాలకు ఏపీలో వైసీపీ ట్రీట్మెంట్ జరిగింది. దీనితో ఇంకెవ్వరు గొంతెత్తలేని
దీనస్థితికి వచ్చేసారు.
సినిమాలలో హీరోలుగా ప్రేక్షకుల మన్ననలు పొందిన ఉన్నవారంతా వైసీపీ పాలనలో జీరోలుగా మారిపోయారు అనే అపవాదును కూడా మూటకట్టుకున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అత్తారింటికి వచ్చిన కొత్తల్లుడి మాదిరి మర్యాదలందుకున్న ఇండస్ట్రీ పెద్దలు వైసీపీ రాగానే అత్తారింటి నుంచి గెంటి వేయబడిన కొత్త కోడలు మాదిరి అవమానాలను ఎదుర్కొన్నారు. ఇటువంటి కీలక సమయంలో ఏపీలో మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే సినీ ఇండస్ట్రీకి మరిన్ని కొత్త కష్టాలు మొదలవడం ఖాయంగా కనపడుతుంది.
తిరుపతి వెంకన్న సేవలు చీటి పాటలు పాడినట్లు పాడి సామాన్యుడికి అందుబాటులో ఉంచలేకపోయిన వైసీపీ ప్రభుత్వం సినీమా టికెట్ల ధరలను మాత్రం నియంత్రించి సామాన్యుడికి అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇంట గొప్ప పెద్ద మనస్సు ఉన్న జగన్ ను చూసి ఆనందపడాలో…బాధపడాలో అర్థంకాని పరిస్థితులలో ఉన్నారు ఏపీ ప్రజానీకం.
Aadarsha Kutumbam - AK47 was recently postponed again, and there is still no clarity about…
The USCIS has officially removed the 540-day automatic extension granted to H-4 visa holders with…