
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో సహా ఆ పార్టీ ముఖ్య నేతలందరూ హడావుడిగా గుళ్ళూ గోపురాల చుట్టూ తిరుగుతున్నారెందుకు?పూజలు, హోమాలు చేస్తున్నారెందుకు?
అంటే కల్తీ నెయ్యి వ్యవహారంలో చేసిన తప్పు ఒప్పుకోకుండా కూటమి ప్రభుత్వంపై ఎదురు దాడి చేస్తూ, ఆ ప్రయత్నాలో తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బ తీశామని, తమపై ‘హిందూమత వ్యతిరేకులు’ ముద్ర పడుతుందని ఆలశ్యంగా గ్రహించడం వల్లనే.. అని ఇది వరకే చెప్పుకున్నాము.
కనుక నాలుగు రోజుల క్రితం మాజీ మంత్రి రోజా సకుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకొని ఆలయం వెలుపల ఫోటోలు దిగి మీడియాలో వచ్చేలా చూసుకున్నారు.
నేడు వైవీ సుబ్బారెడ్డి సతీసమేతంగా వచ్చి శ్రీవారిని దర్శించుకు వెళ్ళారు. రాబోయే రోజుల్లో వైసీపీలో క్రీస్టియన్ మతం అవలంభిస్తున్న చాలా మంది నేతలు తిరుమల శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉంది.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తిరుమల స్వామివారి పట్ల, స్వామి వారి ప్రసాదం, పరకామణి విషయంలో అనేక తప్పులు, అపచారాలు చేశారు.
పదవీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా నేటికీ ప్రతీరోజూ తిరుమల గురించి రకరకాల మాటలు మాట్లాడుతూ, స్వామివారి చిత్ర పటాలు, ప్రతిమలు పట్టుకొని శాసనమండలికి వచ్చి తిరుమల పేరుతో రాజకీయాలు చేస్తూ భక్తుల మనోభావాలు దెబ్బ తీస్తూనే ఉన్నారు.
గమ్మతైన విషయం ఏమిటంటే, ఇలా వ్యవహరిస్తున్న వైసీపీ నేతలు తిరుమల శ్రీవారి ఆలయంలోకి యధేచ్చగా సకుటుంబ సపరివారంగా వచ్చిపోతున్నారు. ఎవరూ ఏమాత్రం సిగ్గుపడటం లేదు కూడా. పైగా హిందూ ఓటు బ్యాంకు చేజారిపోకుండా కాపాడుకోవడం కోసం కూడా వారు తిరుమలను ఈవిధంగా వాడుకుంటుండటాన్ని ఏమనుకోవాలి?
Mouli has become a familiar name through his social media work, web series and Little…
Venkatesh Maha is returning with his next film Attahaasam. The film is set in the…