ఆర్ఆర్ఆర్ తరువాత ఏంటి? రామ్ చరణ్ కసరత్తు

Ram Charan next movie with megastar chiranjeeviరామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా, ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజుగా కనిపించనున్నాడు. అయితే రామ్ చరణ్ పోర్షన్ దాదాపుగా పూర్తి అయిపోయిందని అంటున్నారు. అలియా భట్ కాంబినేషన్ లో కొన్ని కీలక సీన్లు, ఒక పాట మాత్రమే బాలన్స్ ఉందట.

ADVERTISEMENT

అలియా డేట్స్ టైట్ గా ఉండటంతో ఈ షూటింగ్ ఫిబ్రవరి వరకు పూర్తి కాదు అంటున్నారు. ఇది ఇలా ఉండగా రామ్ చరణ్ తన తరువాతి సినిమాల కోసం కథలు వింటున్నాడు. ఒకేసారి రెండు సినిమాలు ఒకే చెయ్యాలని ఆయన భావిస్తున్నాడట. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో కూడా రామ్ చరణ్ కనిపించబోతున్నాడట.

ఈ పాత్ర గెస్ట్ రోల్ కంటే కొంచెం పెద్దదిగా ఉంటుందట. ఇది అలా ఉండగా ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఇప్పటికే 70 శాతం పూర్తి అయ్యిందని చిత్రబృందం చెప్పుకొచ్చింది. అయితే ఇటీవలే విడుదల చేసిన ప్రెస్ నోట్ లో ఇది వరకు చెప్పిన జులై 30, 2020 రిలీజ్ డేట్ గురించి ప్రస్తావించకుండా 2020లో ప్రేక్షకుల ముందుకు పది భాషలలో వస్తుందని చెప్పడం గమనార్హం.

దీనితో సినిమా వాయిదా పడుతుందని ఊహాగానాలు మొదలయ్యాయి. దాదాపుగా 400 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు డీవీవీ దానయ్య. బాహుబలి తరువాత వచ్చే సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే వాటికి ఏమాత్రం తగ్గదని చిత్ర బృందం అంటుంది.

ADVERTISEMENT
Latest Stories