విలక్షణ నటుడు దేవరాజ్.. అందరికీ సుపరిచితం. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, రంగస్థల నటుడు..ఇలా అన్ని రకాల పాత్రలలో తన ముద్రవేశారాయన. ఇప్పుడాయన కుమారుడు ప్రణం దేవరాజ్ కూడా తండ్రిబాటలో నడుస్తున్నారు. ఇప్పటికే కన్నడలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ రోజు ప్రణం దేవరాజ్ కొత్త తెలుగు సినిమా ముహూర్తం జరుపుకుంది.
శంకర్ అనే కొత్త దర్శకుడు దర్శకత్వంలో ప్రణం దేవరాజ్ ఓ చిత్రం చేస్తున్నారు. ఇదొక ఫ్యామిలీ ఎంటర్ టైనర్. హరి గౌడ్ నిర్మాత. ఈ రోజు జరిగిన సినిమా లాంచింగ్ లో హీరో ఆకాష్ పూరి ఫస్ట్ షాట్ కి క్లాప్ కొట్టారు. దేవరాజ్ కెమరాస్విచాన్ చేయగా తనికెళ్ళ భరణి ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు.
సుమన్, రవి శివతేజ ఇతరకీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్ర్రానికి శేఖర్ చంద్ర మ్యూజిక్. బాల సరస్వతి డీవోపీ. అన్నట్టు ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు కన్నడలో రూపొందిస్తున్నారు. జనవరి మూడో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ కి రెడీ అవుతోంది టీం.




