మహాకూటమి ఎవరికి వారే యమునా తీరే

Mahakutami Crunching Numbers, Congress Party First List on- The Wayకాంగ్రెస్ రాబోయే ఎన్నికలకు తన అభ్యర్థుల జాబితా గురించి రోజుకో మాట చెప్తుంది. అభ్యర్థుల ప్రకటనలో తీవ్ర జాప్యం నెలకొందన్న భావనతో ఇప్పటికే క్షేత్రస్థాయిలో తీవ్ర అసంతృప్తి నెలకొన్న నేపథ్యంలో వివాదస్పదంకాని స్థానాల్లో అభ్యర్థుల పేర్లు ప్రకటించాలని పీసీసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

[m9ad]

ADVERTISEMENT

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పొత్తులతో పోయే 27 నుంచి 29 స్థానాలు, ఎక్కువ మంది పోటీ పడుతున్న మరొక 15 నుంచి 20 నియోజక వర్గాలను మినహాయించి 70 నుంచి 75 నియోజకవర్గాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆ లిస్టు పట్టుకుని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే హస్తినకు చేరారు.

మరోవైపు సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్‌తో తాడోపేడో తేల్చుకోవాలని తెలంగాణ జన సమితి పార్టీ నేతలు ఒక నిర్ణయానికి వచ్చారు. మరో రెండ్రోజులే గడువు ఇవ్వాలని ఈలోగా ఆ పార్టీ నుంచి నిర్ణయం వెలువడకపోతే.. ముందుగా 20 నియోజకవర్గాల్లో తెజస అభ్యర్థుల జాబితా ప్రకటించాలనే నిర్ణయానికొచ్చినట్లు తెలిసింది. తర్వాత కూడా నాన్చుడు ధోరణి ఎదురైతే.. ఒంటరి పోరుకు సన్నద్ధమవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయానికొచ్చారు

ADVERTISEMENT
Latest Stories