నాగార్జున కి స్పేస్ ఇవ్వని జగన్ !

Nagarjuna Akkineni Meets YS Jagan Mohan Reddyహీరో నాగార్జున కి ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి మంచి రిలేషన్ ఉంది. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి నుండి నాగ్ ఆ ఫ్యామిలీతో సన్నిహితంగా ఉన్నారు. ఆ బాండింగ్ తోనే అప్పుడప్పుడు వెళ్లి జగన్ ని కలుస్తుంటాడు నాగ్. అయితే తాజాగా జగన్ ని కలిసేందుకు నాగ్ విజయవాడ వెళ్లారు. అలా వెళ్ళిన నాగార్జున కి కలిసేందుకు స్పేస్ ఇవ్వకుండా జలక్ ఇచ్చాడు జగన్.

ADVERTISEMENT

సినిమా పరిశ్రమ గురించి ఈరోజు కేబినేట్ తో జగన్ మీటింగ్ జరిపాడు. ఆ మీటింగ్ కి ముందే నాగ్ అక్కడ ప్రత్యేక్షమయ్యాడు. కానీ జగన్ మాత్రం కేబినేట్ మీటింగ్ తర్వాతే నాగ్ ని కలిసి మాట్లడారు. మీటింగ్ కి ముందు కలిస్తే సినిమా పరిశ్రమ తరుపున నిర్మాతగా వకాల్తా పుచ్చుకొని ఏమైనా ఇబ్బంది పెట్టే అవకాశం ఉందనుకున్నాడో ఏమో కానీ నాగార్జున వెళ్ళగానే కలవకుండా వెయిటింగ్ రూమ్ లో కూర్చోబెట్టాడు.

ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్లను ఆన్లైన్ లో విక్రయించే పనిలో ఉంది. దానికి సంబంధించి అలాగే సినిమా ఇండస్ట్రీ గురించి పలు విషయాల మీద కేబినేట్ మీటింగ్ లో చర్చ జరిపారు.

అనంతరం నాగార్జున ని కలిసి భోజనం చేశాడు జగన్. మరి ఉన్నపళంగా నాగ్ జగన్ ని ఎందుకు కలిసినట్టు..? ఇద్దరి మధ్య ఎలాంటి కన్వర్సేషణ్ జరిగింది ? త్వరలోనే ఇండస్ట్రీ పెద్దలు జగన్ ని కలిసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా ? తెలియాల్సి ఉంది.

ADVERTISEMENT
Latest Stories