రోబో 2.0! ఈ సినిమా గురించి ఏం మాట్లాడాలో…ఎలా మాట్లాడాలో కూడా అర్ధం కావడం లేదు. ఎందుకంటే సినిమాకి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. సినిమాకి మంచి టాక్ వచ్చింది. వసూళ్లు కూడా భారీగానే వచ్చాయి. అసలు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఏకంగా 50 కోట్లకు పైగానే వసూళ్లు అందుకుంది ఈ సినిమా ముఖ్యంగా నైజామ్ లో అయితే వసూళ్ల పరంపర కొనసాగుతూనే ఉంది. అయితే ఏ సినిమా అయినా 50 కోట్ల వసూళ్లు సాధిస్తే ఆ సినిమాని బ్లాక్ బస్టర్ సినిమా అంటారు. సూపర్ డూపర్ హిట్ అంటారు. కలెక్షన్స్ ప్రభంజనం అంటూ కితాబు ఇస్తారు.
[m9ad]
కానీ ఈ సినిమా విషయంలో మాత్రం పాపం నిర్మాతలకు నిరాశే మిగిలింది. నష్టాలే మిగిలేలా సినిమా క్లైమ్యాక్స్ కి చేరింది. దాదాపుగా 72 కోట్ల రూపాయలు పెట్టి కొన్న సినిమా కావడంతో ఈ సినిమా అంత భారీ హిట్ అయినా, పాపం నిర్మాతలకు ఇంకా బ్రేక్ ఈవెన్ కాకపోవడం నిజంగా బాధ కలిగించే విషయమే. అయితే ఈ సినిమా పరిస్థితే కాదు, బడా హీరోల సినిమాల్లో ఎక్కువశాతం అదే పరిస్థితి నెలకొంది అన్నది ట్రేడ్ వర్గాల వాదన. బడా హీరోల సినిమాలు భారీగా ఖర్చు పెట్టడం వల్లనే సినిమా ఖర్చుకు తగ్గట్టు అమ్ముడు పోయినా, వసూళ్ల రూపంలో మాత్రం నిరాశే మిగిలి చివరకు నష్టాల పాలు అవ్వక తప్పడం లేదు మన నిర్మాతలకు.
ఇక చిన్న సినిమాలు అంటే లాటరీ లెక్క హిట్ అయితే జాక్ పాట్ కొట్టినట్లే, ఫ్లాప్ అయితే మాత్రం సదరు నిర్మాత చివరకు ప్లాట్ ఫార్మ్ మీదకు వెళ్ళిపోయే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. అదీ చిన్న-పెద్ద సినిమా మధ్య జరుగుతున్న నిర్మాతల జీవితఆట.



