కేసీఆర్ దెబ్బ….ఆయనే సరెండర్ అయ్యాడు…!

Rajinikanthనిన్న కేసీఆర్ కొట్టిన దెబ్బకు అటు ప్రతిపక్ష పార్టీలు అన్నీ వెల వెల బోయాయి అంటే ఎవ్వరూ కాదనరు. ఎందుకంటే పొరపాటున కాదు అన్నామా, వారిని ఏకరువు పెట్టేస్తారు. ఇదిలా ఉంటే మరో పక్క కేసీఆర్ కొట్టిన దెబ్బ ఇటు తలైవార్ కి కూడా తగిలింది అని చెబుతున్నాయి రాజకీయ, సినిమా వర్గాలు. వినడానికి సిల్లీగా ఉన్నా ఇది నిజమే…విషం ఏంటి అంటే….

[m9ad]

ADVERTISEMENT

పాపం అసలే కాస్త , లాస్ లో నడుస్తున్న సినిమా కావడంతో రోజురోజుకీ వసూళ్ల లెక్కలను ఎప్పటికప్పుడు లెక్కపెట్టుకుంటూ ఉన్న రోబో 2.0 నిన్నటి ఎన్నికల ఫలితాల దెబ్బకు సినిమా హాళ్లు అన్నీ వెలవెల బోయాయి. ఉత్కంట భరితంగా సాగిన ఎన్నికలు కావడం, ఇంకో పక్క కేసీఆర్ ఇతర పార్టీలకు ఇచ్చిన షాక్…అన్నీ వెరసి…ఈ ఫలితాల హడావిడిలో సినిమాను మరచిపోయారు తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులు. అయితే ఫలితాలు మధ్యాన్నాన్నికే తెలిపోవడంతో సాయంత్రం ఫర్స్ట్ షో, సెకెండ్ షో అయినా ప్రేక్షకులు హాల్స్ కు వస్తారేమో అనుకున్నారు సినిమా వర్గాలు, కానీ, కేసీఆర్ దెబ్బకు ఇతర పార్టీలను ట్రోల్ చెయ్యడంలో సోషియల్ మీడియా అంతా బిజీ బిజీగా ఉండడంతో, ఎవ్వరూ అసలు ఈ సినిమా వంక తొంగి చూడలేదు.

మరి ఇప్పటికే పెట్టిన ఖర్చులో సగం వరకూ రాబట్టి వసూళ్లు సాధించిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మాత్రం దేవుడు దిగి రావలసిందే. మరి సంక్రాంతి వరకూ ఈ సినిమా రన్ అవుతుంది అని ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్న నిర్మాతలు ఈ సినిమా లాంగ్ రన్ లో ఏమవుతుందో అన్న టెన్షన్ లో ఉన్నారు. మరి ఈ సినిమా ఎంతటి వసూళ్లను సాధిస్తుందో తెలియాలి అంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే. చూద్దాం మరి ఏం జరగబోతుందో.

ADVERTISEMENT
Latest Stories