ప్రముఖ నటుడు చలపతిరావు ఆకస్మిక మృతి

Actor Chalapathi Rao Passed Awayప్రముఖ తెలుగు సినీ నటుడు చలపతి రావు (78) ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్‌లోని తన నివాసంలో గుండెపోటుతో మరణించారు. ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు నిన్ననే జరిగాయి. ఒక్కరోజు వ్యవధిలోనే చలపతి రావు కూడా మృతి చెందడంతో తెలుగు సినీ అభిమానులు, సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

చలపతి రావు స్వస్థలం కృష్ణాజిల్లా బలిపర్రు గ్రామం. 1944, మే 8వ తేదీన జన్మించారు. సూపర్ స్టార్ కృష్ణ నటించిన గూఢచారి 116 సినిమాతో 1966లో సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. సహాయ నటుడిగా, విలన్‌గా అనేక సినిమాలలో విభిన్నమైన పాత్రలు చేసి మెప్పించారు.

ADVERTISEMENT

ఎన్టీఆర్‌, కృష్ణ, నాగార్జున, చిరంజీవి, వెంకటేష్ వంటి అనేక మందితో కలిసి నటించారు. చలపతిరావుకి ఎన్టీఆర్‌తో మంచి అనుబందం ఉండటంతో ఆయనతో కలిసి అనేక సినిమాలలో నటించారు. యమగోల, యుగపురుషుడు, డ్రైవర్ రాముడు, భలే కృష్ణుడు, జస్టిస్ చౌదరి తదితర సూపర్ హిట్ సినిమాలలో నటించారు.

నిన్నే పెళ్ళాడుతా, నువ్వే కావాలి, సింహాద్రి, బొమ్మరిల్లు, అరుంధతి, సింహా, దమ్ము, లెజెండ్ తదితర 600కి పైగా చిత్రాలలో చలపతి రావు నటించారు. కలియుగ కృష్ణుడు, కడప రెడ్డమ్మ, జగన్నాటకం, పెళ్ళంటే నూరేళ్ళ పంట సినిమాలకి చలపతి రావు దర్శకత్వం వహించారు.

చలపతి రావుకి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. కుమారుడు రవిబాబు మంచి నటుడుగా, దర్శకుడుగా, నిర్మాతగా సినీ పరిశ్రమలో గుర్తింపు సంపాదించుకొన్నారు. చలపతి రావు మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories