
ఎంతో ప్రతిభ, బ్యాక్ సపోర్ట్ ఉన్నప్పటికీ సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి తిప్పలు పడుతున్నవారు ఎందరో ఉన్నారు. కనుక సినీ పరిశ్రమలో ఓ స్థాయికి చేరుకోవడం, ఆ స్థాయిలో నిలిచి ఉండటం మామూలు విషయం కానే కాదు. కనుక మెగాస్టార్ చిరంజీవి అంతటివారు కూడా ఆ స్థాయిని జాగ్రత్తగా కాపాడుకోవడానికి తపిస్తుంటారు. ఎందువల్ల ఆయనకు దాని విలువ బాగా తెలుసు కనుక. కానీ ప్రకాష్ రాజ్‌కి తెలిసిన్నట్లు లేదు.
అందుకే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లను ఉద్దేశ్యించి వ్యంగ్యంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. సిఎం చంద్రబాబు నాయుడు తిరుమల ప్రసాదం కల్తీ విషయం బయటపెట్టినప్పటి నుంచి ప్రకాష్ రాజ్ విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ దీక్షలు చేస్తూ సనాతన ధర్మం అంటూ మాట్లాడటాన్ని ప్రకాష్ రాజ్ తప్పు పడుతున్నారు.
ప్రజలు పరిపాలన చేయమని ఎన్నుకొని అధికారం అప్పగిస్తే పవన్ కళ్యాణ్ ఈవిదంగా చేస్తుండటం చాలా మంది తప్పు పడుతున్న మాట వాస్తవం. ఒకవేళ పవన్ కళ్యాణ్ తీరు సరికాదని ప్రజలు భావిస్తే, సమయం వచ్చినప్పుడు తమ తీర్పు ఇస్తారు. కానీ ఎవరూ ప్రకాష్ రాజ్‌లా ఇలా సోషల్ మీడియాలో వ్యంగ్యంగా కామెంట్స్ చేయడం లేదు.
తాజాగా ప్రకాష్ రాజ్ చెన్నైలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు, ఇటీవల తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఉదయనిధి స్టాలిన్ పక్కనే కూర్చొని ఆ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఎప్పటిలాగే #జస్ట్ ఆస్కింగ్ అని జోడించారు.
ఆ కార్యక్రమంలో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ “ఇక్కడ మన ఉప ముఖ్యమంత్రి (ఉదయనిధి స్టాలిన్) సమానత్వం గురించి మాట్లాడుతుంటే, మరో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సనాతన ధరం గురించి ఏదేదో మాట్లాడుతున్నారు,” అని వ్యంగ్యంగా అన్నారు.
పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశ్యించి ప్రకాష్ రాజ్ చేసిన ఈ కామెంట్స్ అభిమానులకు తీవ్ర ఆగ్రహం కలిగిస్తున్నాయి. వారి ఆగ్రహం వలన ఆయనకు ఎటువంటి నష్టం కలుగకపోవచ్చు. కానీ పదేపదే ఆయన ఈవిదంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ని రెచ్చగొడుతుంటే చివరికి ఆయనే నష్టపోతారు.
చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా అనవసరంగా ఎవరి జోలికి పోయేవాళ్ళు కారు. ఎవరైనా తమని విమర్శిస్తున్నా పెద్దగా పట్టించుకోరు కూడా. అందుకే వారు ప్రకాష్ రాజ్ చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించడం లేదు. ప్రకాష్ రాజ్ జోలికి వారు పోకున్నా ఆయన పదేపదే ఈవిదంగా వారిని రెచ్చగొడితే తప్పకుండా వారూ ఏదో చేస్తారు. అప్పుడు ఆయనకి తెలుగు సినీ పరిశ్రమలో తలుపులు మూసుకుపోయినా ఆశ్చర్యం లేదు.
మూసుకుపోయినా పర్వాలేదు నేను తమిళ్, కన్నడ, మళయాళ సినిమాలు చేసుకోగలనని ప్రకాష్ రాజ్ ధీమాగా ఉంటే అది ఆయనిష్టం. కానీ ఈవిదంగా అతి చేస్తుంటే ఏ రాష్ట్రంలోనైనా, ఏ ఇండస్ట్రీలోనైనా శత్రువులు ఏర్పడుతారని మరిచిపోకూడదు.
ప్రకాష్ రాజ్‌కి ఇప్పుడు ఏపీ పాలకుల తీరు నచ్చడం లేదు. రేపు మరో రాష్ట్ర పాలకుల తీరు నచ్చకపోతే? ఇలాగే విమర్శిస్తారా? విమర్శిస్తే అందరికీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అంత సహనం ఉంటుందా? అప్పుడు నా పరిస్థితి ఏమిటి? అని ప్రకాష్ రాజ్ ఆలోచించుకోవాలి.
A Reddit post has gone viral for claiming that the cybersecurity firm Fortinet has laid…
An Indian F-1 student finds herself in serious trouble. A misunderstanding at Walmart has left…