డ్రగ్స్ కేసు నిందితుడి నుండి కేటీఆర్ చెక్ తీసుకోవడమేంటి?

Actor Subba Raju cheque to Minister KTRతెలంగాణ మంత్రి కేటీఆర్‌ను నటుడు సుబ్బరాజు సర్‌ప్రైజ్ ఇచ్చారు. శుక్రవారం రాత్రి ఫ్యామిలీ ఫంక్షన్లో పాల్గొన్న మంత్రిని సుబ్బరాజు కలిశారు. “రాత్రి ఫ్యామిలీ ఫంక్షన్లో ఉండగా.. సుబ్బరాజు నా దగ్గరికి నడుచుకుంటూ వచ్చాడు. సీఎం రిలీఫ్ ఫండ్‌ కోసం చెక్ అందజేశార’ని కేటీఆర్ తెలిపారు తన ట్విట్టర్ అకౌంట్ లో తెలిపారు.

ADVERTISEMENT

మంచి మనసుతో స్పందించినందుకు థ్యాంక్స్ బ్రదర్ అంటూ ఆయన సుబ్బరాజును ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. అయితే దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో రగడ జరుగుతుంది. సుబ్బరాజు అప్పట్లో తెలుగు సినిమా ఇండస్ట్రీ డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్నారు. విచారణకు కూడా హాజరయ్యారు.

ఆ కేసును ప్రభుత్వం ఎందువల్లో కొంచెం పక్కన పెట్టింది. అయితే ఈ కేసులు ఎవరికీ క్లీన్ చిట్ మాత్రం ఇవ్వలేదు. మరి అలాంటప్పుడు ఒక నిందితుడి నుండి మంత్రి చెక్ ఎలా తీసుకుంటారు? ఇది కేసును పక్క దారి పట్టించే ప్రయత్నమేమో అని కొందరు అనుమానిస్తున్నారు. అయితే అందరితో పాటు కేటీఆర్ కూడా డ్రగ్స్ కేసును మర్చిపోయి ఉంటారు.

ADVERTISEMENT
Latest Stories