‘బ్రహ్మోత్సవం’ బొమ్మ ప్రణీత కారు బోల్తా!

pranitha-meets-with-a-road-accidentసినీ నటి ప్రణీతకు రోడ్డు ప్రమాదంలో స్వల్ప గాయాలయ్యాయి. ఖమ్మం నుంచి హైదరాబాద్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా మోతే దగ్గర ఒక బైక్ ను తప్పించబోయిన ఆమె కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఖమ్మంలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.

ప్రమాదం జరిగిన ప్రాంతంలో రోడ్డు పనులు జరుగుతుండగా, అక్కడే ఉన్న ఏఈఈ అధికారులు వెంటనే స్పందించి వెంటనే అంబులెన్స్ ను పిలిపించారు. ఈ ప్రమాదంలో ప్రణీత, ఆమె తల్లి, మరో ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారని సమాచారం. ప్రస్తుతం తాము క్షేమంగా ఉన్నామని, తక్షణం స్పందించి అంబులెన్స్ ను పిలిపించిన అధికారులకు కృతఙ్ఞతలు చెబుతున్నానని ప్రణీత ట్వీట్ చేసింది.

ADVERTISEMENT

పవన్ కళ్యాణ్ “అత్తారింటికి దారేది” సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ‘బాపూ బొమ్మ’గా అలరించిన ప్రణీత, ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ‘రభస’లోనూ కనువిందు చేసింది. తాజాగా ప్రిన్స్ మహేష్ బాబుతో ‘బ్రహ్మోత్సవం’లో సమంత, కాజల్ లతో మరో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న విషయం తెలిసిందే.

ADVERTISEMENT
Latest Stories