ఈ స్థాయి ఎన్నికల్లో ఇంత రాద్ధాంతం అవసరమా?

AP MPTC ZPTC polling amid election tensions

మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రంలో మిగిలిన జిల్లాల్లో ప్రశాంతంగా పోలింగ్ జరిగిందని కానీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులలోనే అల్లర్లు, విధ్వంసం జరిగాయి. ఎందుకు? అని మంత్రి నారా లోకేష్‌ ప్రశ్నించారు.

బహుశః అందువల్లేనేమో నేడు జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్‌లో రాష్ట్రంలో పలు జిల్లాల్లో అల్లర్లు, విధ్వంసం జరుగుతున్నట్లున్నాయి. తద్వారా ఈ అల్లర్లకు వైసీపీ కారణం కాదని టీడీపియేనని నిరూపించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సందేహం కలుగుతుంది.

ADVERTISEMENT

అయితే చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కట్టడి చేసేందుకు గట్టిగా ప్రయత్నించిన పులివర్తి సుధా రెడ్డి, “ఇవేం పెద్ద ఎన్నికలు కావు. వీటితో ఎవరి జాతకాలు మారిపోవు. 2029 శాసనసభ ఎన్నికలలో చూసుకుందాం,” అన్నారు.

ఆమె చెప్పింది అక్షరాల నిజమేనని అందరూ అంగీకరిస్తారు. బహుశః వైసీపీ కూడా అంగీకరిస్తుంది. మరి అటువంటప్పుడు ఈ ఎన్నికలను ఇంత క్లిష్టంగా మార్చాల్సిన అవసరం ఏముంది?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో పలువురు సొంత బలంతోనే గెలిచారు. కనుక వైసీపీ కూడా స్థానికంగా బలమైన అభ్యర్ధులను ఎంపిక చేసి, జిల్లా స్థాయి నాయకులకు పూర్తి బాధ్యత అప్పగించి ఉంటే వారే గెలిపించుకునేవారు కదా? టీడీపీ, జనసేన, బిజేపిలు అలాగే చేస్తున్నాయి కదా?

కానీ ఈ స్థాయి ఎన్నికలను వైసీపీ అధిష్టానం ఈవిధంగా ఎందుకు హ్యాండిల్ చేస్తోంది?అవసరమా? కానీ ఇంత రచ్చరచ్చచేసిన తర్వాత అత్యధిక స్థానాలు గెలుచుకుంటే ప్రయోజనం నెరవేరినట్లే. కానీ ఓడిపోతే వైసీపీ ఏం సాధించినట్లు? ఆలోచిస్తే బాగుండేది.

ADVERTISEMENT
Latest Stories