మేజర్… నిజమైన బలం అదే

Adivi sesh major movie teaserఅడివి శేష్ మేజర్ ఫస్ట్ లుక్ టీజర్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది. మేజర్ 26/11 హీరో, మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్. టీజర్ అసాధారణమైన సాంకేతిక విలువలతో హైప్‌కు అనుగుణంగా ఉంది. డైలాగులు మరియు విజువల్స్ ఆసక్తిరేపేవిగా ఉన్నాయి. ఈ చిత్రం ప్రకటించినప్పుడు ఇప్పటికే ఈ కథాంశం మీద చాలా సినిమాలు వచ్చాయి కాదా అని అంతా పెదవి విరిచారు.

అయితే అటువంటి అనుమానాలన్నీ ఈ టీజర్ తో పటాపంచలు అయిపోయాయి. ఇది పూర్తిగా 26/11 దాడుల గురించి కాదు.. సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం గురించి. ఆ పాయింట్ సినిమాకు చాలా అవసరమైన తాజాదనాన్ని తెస్తుంది. టీజర్ లో ఇటువంటి సినిమాలకు ఎంతో అవసరమైన దేశభక్తి, అలాగే ఎమోషనల్ కంటెంట్ కూడా బానే ఉన్నట్టుగా ఉన్నాయి.

ADVERTISEMENT

టీజర్ లో చూపించినట్టుగానే భారీతనం, ఎమోషనల్ కంటెంట్ ఒక చోట చేర్చగలిగితే అడివి శేష్ ఒక్క తెలుగులోనే కాకుండా దేశవ్యాప్తంగా ఈ సినిమాతో పెద్ద హిట్ కొట్టడం ఖాయమనే అనుకోవాలి. కరోనా పరిస్థితులు అనుకూలిస్తే జులై 2న ప్రేక్షకుల ముందుకు వస్తుంది ఈ సినిమా.

మేజర్ సినిమాను `గూఢచారి` ఫేమ్ శశి కిరణ్ తిక్కా తెరకెక్కిస్తున్నాడు. సోనీ పిక్చర్స్, సూపర్ స్టార్ మహేష్ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగుతో పాటు హిందీ,మలయాళం, తమిళం, కన్నడలో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ్ల, బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories