“లిటిల్ హార్ట్స్” అనే సింపుల్ & రిలేటబుల్ సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు సాయి మార్తాండ్ ఇటీవల తన తదుపరి సినిమా అడివి శేష్ తోనే అని “డెకాయిట్” ప్రీరిలీజ్ ఈవెంట్లో అనౌన్స్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. నిజానికి సాయి మార్తాండ్ చాలామంది యంగ్ హీరోస్ కి కథ చెప్పాడు. నాగచైతన్య, నితిన్ వంటి వాళ్లు ఈ లిస్ట్ లో ప్రముఖులు. లాస్ట్ కి శేష్ దగ్గర సెటిలయ్యాడు.
ఇక్కడే వచ్చింది అసలు టెన్షన్. నిజానికి శేష్ తో లవ్ స్టోరీ అనేది మంచి ఆలోచనే. అయితే.. “డెకాయిట్” తాలూకు రిజల్ట్ మరియు “G2” సినిమా ఎక్స్ పెక్టేషన్స్ తాలూకు ఎఫెక్ట్ అనేది కచ్చితంగా సాయి మార్తాండ్ మీద పడుతుంది. “డెకాయిట్” ప్రేక్షకుల్ని పూర్తిస్థాయిలో అలరించలేకపోయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇక లాక్ డౌన్ టైంలో ఇంటర్నేషనల్ స్పై సినిమాలు పోలోమని చూసేసిన ప్రేక్షకులు ఇప్పుడు “G2”ని ఎలా రిసీవ్ చేసుకుంటారు? రిఫరెన్సులు లేకుండా కొత్తగా శేష్ ఎలా ప్రెజెంట్ చేస్తాడు అనేది పెద్ద ప్రశ్న.
సో, ఈ సినిమాల తర్వాత వచ్చే సాయి మార్తాండ్ సినిమా శేష్ కి చాలా ఇంపార్టెంట్. అదే విధంగా సాయి మార్తాండ్ కి కూడా సెకండ్ సినిమాతో తన టాలెంట్ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. లేకపోతే “లిటిల్ హార్ట్స్” క్రెడిట్ మొత్తం మౌళి ఖాతాలోకి వెళ్లిపోతుంది. ఒకరకంగా శేష్ & సాయి ఇద్దరికీ ఈ సింపుల్ లవ్ స్టోరీ హిట్ అవ్వడం అనేది చాలా కీలకం కానుంది.




