తెలంగాణాలో మళ్ళీ ఉప ఎన్నిక పోరు?

again byelection in telanganaజీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత అధికార పార్టీ ఉపఎన్నికలకు తెరతీయబోతోందా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఇచ్చే ఉత్సాహంతో టీఆర్ఎస్ ఉపఎన్నికల విషయంలో ఓ నిర్ణయం తీసుకోబోతోంది. ఇప్పటికే వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్ లోకి చేరిన నాయకుల్ని రాజీనామాలు చేయించాలని అధికార టీఆర్ఎస్ మీద విపక్షాలు ఒత్తిడి తెస్తున్నాయి. తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి వారిపై సుప్రీంకోర్టుకు వ్యవహారం వెళ్లింది.

అయితే, అది స్పీకర్ పరిధిలోని విషయమంటూ అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గనుక కొడితే, అదే ఊపుతో సనత్ నగర్ ఉపఎన్నిక కూడా జరిపించాలన్నది తెలంగాణ రాష్ట్ర సమితి ఆలోచన. దీంతో ప్రతిపక్షాల నోళ్లు కూడా శాశ్వతంగా మూయించాలన్నది గులాబీ అధినేత సీఎం కేసీఆర్ ఆలోచనగా ఉన్నట్టు కేసీఆర్ సన్నిహిత వర్గాలు చెబుతున్న మాట.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories