వైసీపీ జెండాపై గెలిచిన ఎమ్మెల్యేలు అధికార పార్టీ టిడిపిలోకి వస్తున్నారని గత వారం రోజులుగా హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. మరో వైపు టీడీపీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారంటూ వైసీపీ వర్గాలు కూడా చెప్పాయి. ఈ వాదనలు ఎలా ఉన్నా, ఇప్పటివరకు ఒక్క ఎమ్మెల్యే కూడా ఇటు, అటులు జరగలేదు. అయితే వైసీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్స్ కొనసాగుతోంది… ముఖ్యంగా భూమా వర్గీయులపై..!
ఈ క్రమంలో గుంటూరులో మీడియాతో మాట్లాడిన టీడీపీ సీనియర్ నేత, ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “వైసీపీ ఆరోపిస్తున్నట్లుగా మాది మైండ్ గేమ్ ఎంత మాత్రం కాదు, వచ్చే నెల 5వ తేదీ లోగా వైసీపీకి చెందిన ఎంతమంది ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరతారో మీరే చూస్తారు. ఆ తర్వాత వైసీపీకి మిగిలే ఎమ్మెల్యేల లెక్కతేలుతుంది” అని బదులివ్వడంతో మరో ఆసక్తికర చర్చకు తెర లేచింది. అంటే మార్చి 5వ తేదీ అన్నది జంపింగ్ జిలానీలకు ‘డెడ్ లైన్’ అన్న మాట!



