పాపం అఖిల్ ఎన్ఆర్‌డీ.. భార్య లేచిపోతే వీడియో! అదీ వైరల్!

Akhil NRD Wife Megha Leaves Home

కేరళకు చెందిన అఖిల్ ఎన్ఆర్‌డీ మొదట టిక్ టాక్ వీడియోలు చేసుకుంటూ మంచిపేరు సంపాదించుకున్నారు. లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నందున సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయిన్సర్‌గా గుర్తింపు ఉంది. దాంతో మళయాళ సినీ పరిశ్రమలో అవకాశాలు లభించడంతో సినీ నటుడుగా ఎదిగారు.

రెండేళ్ళ క్రితమే ప్రేమించిన మేఘని పెళ్ళి చేసుకున్నారు. ఇటీవలే భార్యకు కారు కొనిచ్చారు. వారిద్దరి జీవితం చక్కగా సాగిపోతుంటే ఊహించని మలుపు తిరిగింది. ప్రేమించి పెళ్ళి చేసుకున్న భార్య ఓ బస్సు కండక్టర్‌తో లేచిపోయింది. భర్త కంటే బస్సు కండక్టర్‌ మేలని అనుకుందో లేక భర్తలో లేనిది అతనిలో ఉందని నమ్మి జంప్ అయిపోయిందో తెలీదు కానీ మొన్న అర్ధరాత్రి జంప్!

ADVERTISEMENT

అఖిల్‌కి ఇది చాలా పెద్ద షాక్ అని అర్ధమవుతూనే ఉంది. కానీ అతను కూడా అందరికీ ఇంకా పెద్ద షాక్ ఇచ్చారు. తన భార్య అర్ధరాత్రి బస్సు కండక్టర్‌తో లేచిపోతున్నప్పుడు సీసీ కెమెరాలలో రికార్డ్ అయిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ‘నా భార్య జంప్.. అంతే!’అని ట్వీట్‌ చేశారు.

అంతకు ముందు అఖిల్ చేసిన వీడియోల కంటే మా ఆవిడ జంప్ అంటూ అతను పెట్టిన ఈ వీడియో వైరల్ అవుతోంది.

అయితే భార్య బస్సు కండక్టర్‌తో లేచిపోవడంపై అఖిల్ స్పందన మాత్రం చాలా హుందాగా ఉంది. “నా భార్య ఎందుకో నన్ను వద్దనుకొని వెళ్ళిపోయింది అంతే. ఇందుకు నేను ఆమెను తప్పు పట్టను. దేవుడు నాకు ఇలా రాసి పెట్టాడు. అంతే! ప్రతీ మనిషి జీవితంలో అనేక సమస్యలు, కష్టాలు ఎదురవుతూనే ఉంటాయి. వాటిలో ఇది కూడా ఒకటని స్వీకరించక తప్పదు,” అని అన్నారు.

ADVERTISEMENT
Latest Stories