మాల్దీవుల్లో పండగ చేసుకుంటున్న అక్కినేని “గ్రీకువీరులు”

akkineni family in maldivesఅక్కినేని నట “త్రయం” నాగార్జున, నాగచైతన్య, అఖిల్ లు ప్రస్తుతం మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్నారు. స్విమ్మింగ్ సూట్స్ లో అందమైన మాల్దీవుల బ్లూ కలర్ వాటర్ లో ఆడుతున్నామని ‘కింగ్’ నాగార్జున ఓ మూడు ఫోటోలను తన అభిమానులతో పంచుకున్నారు.

‘సోగ్గాడే చిన్నినాయనా’ సక్సెస్ తో ఉన్న నాగ్, ప్రస్తుతం ‘ఊపిరి’ సినిమా ఆడియో, ట్రైలర్స్ కు లభిస్తున్న స్పందన పట్ల కూడా పూర్తి సంతోషంతో ఉన్నారు. మరోవైపు చైతూ తన “సాహసమే శ్వాసగా సాగిపో…” సినిమాకు తుది రూపాన్ని తీసుకువచ్చే పనిలో ఉన్నారు. అలాగే మరికొద్ది రోజుల్లో అఖిల్ కూడా తన రెండవ చిత్రానికి శ్రీకారం చుట్టబోతున్న నేపధ్యంలో ముగ్గురు “గ్రీకువీరులు” కలిసి హాలిడేను చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories