అల్లు అర్జున్ ను భుజాలకెత్తుకున్న రానా!

allu arjun and rana at sensation eventఈ తరం హీరోల మధ్య ఎలాంటి సత్సంబంధాలు ఉన్నాయో అని చెప్పడానికి ఒక ఉదాహరణ ఈ ఫోటో. అందరితో కలివిడిగా ఉండే దగ్గుపాటి వారి వారసుడు హీరో రానా మెగా హీరో అల్లు అర్జున్ ను భుజాలకెత్తుకుని మోస్తున్న ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

శనివారం రాత్రి హైదరాబాద్ లో గచ్చిబౌలి స్టేడియంలో ‘సెన్సేషన్’ పేరుతో జరిగిన సంగీత విభావరిలో చోటు చేసుకున్న సంఘటన ఇది. ఇలాంటి అరుదైన ఫోటోలను చూస్తూ ఆనందించడం సినీ అభిమానుల వంతు. ఎందుకంటే… బాలీవుడ్ మాదిరి మన తెలుగు హీరోలు ఇంత కలుపుగొలుతనంగా ఎప్పుడూ దర్శనమివ్వరు కదా!

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories