బన్నీ ఒక అడుగు ముందుకేశాడు… మహేష్ కూడా వేస్తే మంచిది

Allu Arjun best wishes to mahesh babu Sarileru Neekevvaruసంక్రాంతి సంబరం దగ్గరకు వచ్చేసింది. ఇంకో రెండు రోజులలో మొదటి సంక్రాంతి సినిమా దర్బార్ విడుదల కానుంది. అయితే ప్రధానంగా పోటీ మాత్రం సరిలేరు నీకెవ్వరూ, అల వైకుంఠపురంలో సినిమాల మధ్యనే ఉండబోతుంది. ప్రమోషన్స్ లో ఒకరి మీద ఒకరు కాళ్లు రువ్వుకున్నారు. రిలీజ్ డేట్ల గురించి కూడా చివరి నిముషం వరకూ సస్పెన్స్ కొనసాగింది.

ADVERTISEMENT

అయితే ఇప్పుడు మరికొన్ని రోజులలో ప్రేక్షకులు ఏ సినిమా ఎలా ఉంది అనేది నిర్ణయిస్తారు. ఇప్పటివరకూ ఉన్న పోటీ అభిమానుల మధ్య కొంత గ్యాప్ ని అయితే సృష్టించింది. అది పరిశ్రమకు ఎంత మాత్రం మంచిది కాదు. వాటిని తొలగించే క్రమంలో బన్నీ నిన్న మొదటి అడుగు వేశాడు. అల వైకుంఠపురంలో ఈవెంట్ లో మిగతా సంక్రాంతి సినిమాలను పేరు పేరున సక్సెస్ అవ్వాలని విష్ చేశాడు.

దీనికి బన్నీని ఖచ్చితంగా అభినందించాల్సిందే. అయితే సరిలేరు నీకెవ్వరూ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో మహేష్ బాబు ఆ విషయం మర్చిపోయినట్టు ఉన్నారు. అంత పెద్ద ఈవెంట్ లో మెరుపు అనేది సహజం. మహేష్ బాబు కూడా మిగతా సంక్రాంతి సినిమాలను విష్ చేస్తే అభిమానుల మధ్య మంచి వాతావరణం ఉంటుంది.

ఇది ఇలా ఉండగా అనిల్ గత ఏడాది సంక్రాంతికి ఎఫ్ 2 వంటి అతిపెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. వచ్చే సంక్రాంతికి మరో బ్లాక్ బస్టర్ ఇవ్వాలని అనిల్ కృతనిశ్చయంతో ఉన్నాడు. మరోవైపు గతంలో బన్నీకి రెండు పెద్ద హిట్లు ఇచ్చిన త్రివిక్రమ్ ఈ సారి హాట్ట్రిక్ పూర్తి చెయ్యాలనుకుంటున్నాడు.

ADVERTISEMENT
Latest Stories