
ఇటు ప్రజా జీవితానికి దగ్గరగా రాజకీయాలలో బిజీగా ఉంటున్న పవన్ నుంచి తమ వినోదానికి తమ ఆహ్లాదాన్ని OG సినిమా కావాలి అంటూ పల్లె పండుగ సభకు విచ్చేసిన పవన్ అభిమానులు OG ..OG అంటూ కేరింతలు కొడుతుంటే వారిని వారించిన పవన్ ముందు ప్రజలు తనకిచ్చిన బాధ్యత ఆ తరువాతే వినోదం అంటూ వారికి హితవు పలికారు.
అలాగే ముందుగా ప్రజల కడుపు నింపి వారికి మౌలిక సదుపాయాలు అందించి ఆ తరువాత వినోదం గురించి ఆలోచిద్దాం అంటూ పవన్ తన అభిమానులకు తన ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. అయితే ఈ నేపథ్యంలో తన సహా నటుల గురించి కూడా ఈ సభలో పవన్ ప్రసంగించారు.
తాను ఒక నటుడినే అలాగే తన తోటి నటులైన మహేష్ బాబు, తారక్, చిరంజీవి, రామ్ చరణ్, నాని అల్లు అర్జున్…ఇలా అందరు హీరోలు బాగుండాలని తానూ ఎప్పుడు కోరుకుంటానంటూ అల్లు అర్జున్ పేరు కూడా ప్రస్తావించారు పవన్. దీనితో గత కొద్దికాలం గా సాగుతున్న మెగా vs అల్లు, పవన్ ఫాన్స్ vs బన్నీ ఆర్మీ అంటూ సాగుతున్న అర్ధం పర్థం లేని సోషల్ మీడియా వార్ కు ఇక తెరపడనుందా అనేది వేచి చూడాలి.
అయితే గతంలో అల్లు అర్జున్ పవన్ అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ పవన్ గురించి ఇక్కడ ‘చెప్పను బ్రదర్’ అంటూ చేసిన కామెంట్స్ ఇప్పటికి సంచలనమనే చెప్పాలి. అయితే ఇప్పుడు పవన్ నోటా అల్లు అర్జున్ పేరు రావడంతో ‘చెప్పాడు బ్రదర్’ అంటూ పవన్ వీడియో ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా “మేము మేము బాగానే ఉంటాము మీరు మీరు కూడా బాగుంటే ఇంకా బాగుంటుంది” అని సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన వ్యాఖ్యలు ఒక్కసారి ప్రస్తావించుకోవాలి. ఈ వ్యాఖ్యల వెనుక దాగిఉన్న గూడార్ధం కూడా ఈ ఫ్యాన్ వార్ గురించే అనేది హీరోలకు తెలిసినా వారి అభిమానులకు మాత్రం మాత్రం అది అర్ధం కాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
కనీసం ఇప్పటికైనా తమ అభిమాన హీరో పట్ల కూసంత గౌరవం ఉన్నా, వారి మాటలకూ కాస్త విలువనిచ్చినా ఇలా ఈ సోషల్ మీడియాలో జరిగే ఫ్యాన్ వార్ కు ఒక ఎండ్ కార్డు వేయవచ్చు. కనీసం ఇకనైనా ఆలోచించండి బ్రదర్స్..
Kamiya Jani has been a popular face on social media for her way of interacting…
A Reddit post has gone viral for claiming that the cybersecurity firm Fortinet has laid…