శ్రీను వైట్ల ‘కాన్సెప్ట్ పోస్టర్’లో కాన్సెప్ట్ ఏంటో?

Amar Akbar Anthony Concept Poster- Srinu Vaitlaమాస్ మహారాజా హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తోన్న “అమర్ అక్బర్ అంటోనీ” కాన్సెప్ట్ పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. కాన్సెప్ట్ పోస్టర్ అన్నారు గానీ, ఇంతకీ ఇందులో ఏం కాన్సెప్ట్ ఉందన్నది వీక్షకులకు అర్ధం కాని పరిస్థితి. రాజు రాణిలతో పాటు ఉంగరానికి, టైటిల్ కు ఉన్న లింక్ ఏమిటో బహుశా దర్శకుడు చెప్తే గాని తెలియదు.

టాలీవుడ్ లో వరుస బ్లాక్ బస్టర్స్ ను అందిస్తోన్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుండడం ప్రధాన ప్లస్ పాయింట్ కాగా, ఈ సినిమాతో గోవా బ్యూటీ ఇలియానా మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తుండడం మరో విశేషం. అక్టోబర్ 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారిక ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories