
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్వాంటం వ్యాలీ దానిలో క్వాంటం కంప్యూటింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అమరావతిలో భవన నిర్మాణంలో కూడా అత్యాధునిక టెక్నాలజీ వినియోగిస్తున్నారు.
అమరావతిలో రూ.3,673 కోట్లు వ్యయంతో హెడ్స్ ఆఫ్ డిపార్ట్‌మెంట్ (హెచ్‌ఓడీ) కోసం సుమారు 212 మీటర్ల ఎత్తుతో 40 అంతస్తులతో టవర్లు నిర్మిస్తోంది.
రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఆటోమేటిక్ క్లైంబింగ్ ఫార్మ్‌వర్క్ సిస్టమ్ (ACFS), డైగ్రిడ్ గ్రిడ్ అనే రెండు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వీటి నిర్మాణంలో ఉపయోగిస్తున్నారు.
హైడ్రాలిక్ క్లైంబింగ్ సిస్టమ్స్ ప్రత్యేకత: సాధారణంగా భారీ క్రేన్స్ సాయంతో ఒక్కో అంతస్తుకి నిర్మాణ పరికరాలు, ప్రీ ఫ్యాబ్రికేటడ్ గోడలు, స్లాబ్స్ వగైరా చేర్చుతూ నిర్మాణం కొనసాగిస్తారు. కానీ ఎల్ అండ్ టీ కంపెనీ క్రేన్స్ బదులు ఒక్క బటన్ నొక్కితే చాలు హైడ్రాలిక్ సిస్టం ద్వారా పైకి చేరుకునేలా ఈ అత్యాధునిక టెక్నాలజీ వినియోగిస్తోంది.
క్రేన్ల ద్వారా ఈ పని పూర్తిచేయడానికి 10-15 రోజులు సమయం పడితే, ఈ స్వయంచాలిత హైడ్రాలిక్ టెక్నాలజీ ద్వారా కేవలం ఒక్క రోజులోనే పని పూర్తవుతోంది. అంటే సమయం, డబ్బు వృధా కాకుండా వేగంగా, బలంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయో అర్ధమవుతోంది.
స్టీల్ డైగ్రిడ్ ఫ్రేమ్ వల్ల ప్రత్యేకత: ఇంత ఎత్తు, ఇంత భారీ భవనాలు నిర్మించాలంటే చాలా భారీ కాలమ్‌లు నిర్మించాల్సి ఉంటుంది. కానీ ఈ స్టీల్ డైగ్రిడ్ ఫ్రేమ్ పద్దతిలో కాలమ్స్ సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. కాలమ్స్ నిర్మాణ ఖర్చు భారీగా తగ్గుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ పని జరుగుతుంది.
దీనిలోనే ‘కార్నర్ నోడ్’ అనే మరో కొత్త టెక్నాలజీ కూడా అమలు చేస్తున్నారు. ఈ ప్రత్యేక జాయింట్లు భవనానికి భూకంప నిరోధకతను పెంచడంతో పాటు, నిర్మాణ బలాన్ని మరింత బలపరుస్తాయి.
అమరావతి కోసం లక్షల కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారు. మరో వందేళ్ళు నిర్మించినా అమరావతి పూర్తి కాదు. కృష్ణ నది పక్కన నిర్మిస్తున్న అమరావతి వరదలొస్తే మినిగిపోతుంది. భూకంపాలొస్తే కూలిపోతుందని దుష్ప్రచారం చేస్తున్న మావిగన్లకు ఈ టెక్నాలజీ అర్థం అవుతుందో లేదో?
A simple run-out chance turned into a costly mistake during the RR vs LSG match…
In a surprising update, S. Thaman has replaced Harshavardhan for the upcoming film starring Venkatesh…