అమరావతి ‘అఖండ జ్యోతి’కి మరోసారి అరిష్టం!

amaravati akhanda jyothi fireనవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం కనీసం 50 శాతం వరకూ పూర్తయ్యే వరకూ అనునిత్యమూ వెలుగుతూ ఉండాలని సంకల్పించిన “అఖండ జ్యోతి” మరోసారి కొండెక్కడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గత సంవత్సరం అమరావతి శంకుస్థాపన సందర్భంగా, అమరేశ్వరాలయంలో వెలిగించిన జ్యోతి అందరికీ స్ఫూర్తిని నింపి, ప్రజల్లో బలమైన నమ్మకాన్ని కలిగించింది.

ఇక నుండి ‘అఖండ జ్యోతి’గా ఉంచుతామని, ఈ సంవత్సరం శివరాత్రి తరువాత కోటప్పకొండ త్రికోటేశ్వరుని సన్నిధిలో ఆ జ్యోతిని ఉంచుతామని ఏపీ సర్కారు గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. నిరంతరమూ వెలగాల్సిన జ్యోతి అమరేశ్వరాలయం సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రెండవసారి కొండెక్కింది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక వాసులు అరిష్టంగా భావిస్తున్నారు. ఇకనైనా సెంటిమెంట్ తో కూడిన జ్యోతి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలు కోరుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories