సంబరాల రాంబాబు ‘టైగర్ రాంబాబు’గా మారి జైలుకి వెళ్ళిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ, “ఇంత రాజకీయ అనుభవం ఉన్న నేను ఎవరో రెచ్చగొడితే హుందాగా ప్రవర్తించాల్సిన నేను ఆవేశంతో నోరు జారాను. ముఖ్యమంత్రిని ఉద్దేశ్యించి అలా మాట్లాడటం తప్పే,” అని అన్నారన్నారు.
కనుక వారు చెప్పిన దాని ప్రకారం అంబటి రాంబాబు పశ్చాతాపపడ్డారని అర్ధమవుతోంది. కానీ రోజూ అంబటి రాంబాబుని చూస్తున్నవారికి ఆయన పశ్చాతాపపడే రకం కాదని బాగా తెలుసు. తాడేపల్లి ప్యాలస్ నుంచి స్క్రిప్ట్ ప్రకారమే ఆయన ఆవిధంగా మాట్లాడారని కూడా తెలుసు. కనుక ఎవరూ అయన ప్రాయశ్చిత్తం, పశ్చాతాపాలను నమ్మడం లేదు. ఆశించడం లేదు కూడా!
ఆయన కూడా వారి నమకాన్ని వమ్ము చేయలేదు. ఈరోజు మధ్యాహ్నం ఆయనని పోలీసులు గుంటూరు సివిల్ జడ్జ్ కోర్టుకి వ్యానులో తీసుకువచ్చినప్పుడు అక్కడ తన కోసం ఎదురుచూస్తున్న అనుచరులు, మీడియా ప్రతినిధులను చూసి గడ్డం కింద నుంచి చెయ్యి తిప్పుతూ పుష్ప సినిమాలో అల్లు అర్జున్‌లా ‘తగ్గేదేలే’ అని సైగ చేశారు. అది చూసి ఆయన అనుచరులు కూడా ఉత్సాహంగా ‘రప్పారప్పా’ అంటూ నినాదాలు చేశారు.
కనుక వైసీపీ డీఎన్ఏలో ఇలాంటి లోపాలున్నప్పుడు అంబటి రాంబాబు పశ్చాతాపపడ్డారని, పడతారని అనుకుంటే అంత కంటే అవివేకం ఉంటుందా?
సత్తెనపల్లి లాటరీ టికెట్ కేసులో గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర రావు పిర్యాదు మేరకు సత్తెనపల్లి పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఈ కేసులో న్యాయమూర్తి పీటీ వారెంట్ జారీ చేశారు. ఈ కేసులోనే అంబటి రాంబాబు నేడు కోర్టుకు హాజరైనప్పుడు ‘తగ్గేదేలే’ లేదని తేల్చి చెప్పేశారు. అంతకు ముందోసారి మీడియాతో మాట్లాడుతూ, “నన్ను అరెస్ట్ చేసుకుంటారా చేసుకోండి. ఇక్కడే ఉన్నా. అరెస్ట్ చేస్తే బెయిల్ కూడా అడగను. ఎంతకాలమైన జైల్లోనే ఉంటానని కూడా ఖరాఖండీగా చెప్పేశారు. కనుక టపాకాయలు కాల్చడం, స్వీట్లు పంచుకోవడం వంటివి తొందరపాటే అవుతుంది.
పుష్ప స్టైల్లో అంబటి రాంబాబు: “తగ్గేదేలే” అంటూ సైగలు…#AmbatiRambabu pic.twitter.com/L7DALfeHXD
— M9 NEWS (@M9News_) February 12, 2026






