బాలయ్య మనిషి టీడీపీకి హ్యాండ్ ఇవ్వడానికి సిద్ధం అయ్యాడా?

Ambika Krishna joining -BJPపశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నిర్మాత అంబికా కృష్ణ పార్టీలో బాలయ్య మనిషిగా పేరు. గత ప్రభుత్వంలో ఆయనకు బాలయ్య రికమండేషన్ తో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు చంద్రబాబు. ప్రభుత్వం మారడంతో ఇటీవలే ఆ పదవికి రాజీనామా చేశారు ఆయన. మరోవైపు ఇప్పుడు అంబికా కృష్ణ పార్టీని వీడనున్నట్లు సమాచారం. త్వరలో ఆయన భాజపా తీర్థం పుచ్చుకోనున్నారని వార్తలు వస్తున్నాయి.

ADVERTISEMENT

ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న ఆయన బీజేపీ ప్రతినిధులతో సమక్షంలో తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. కండువా కప్పుకుని రాష్ట్రానికి తిరిగి వస్తారని సమాచారం. అయితే, ఈ ఎన్నికల్లో దారుణ పరాజయానికి గురైన టీడీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు కాషాయ కండువాను కప్పుకోన్నారు. మరోవైపు కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లిన ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు స్వదేశానికి ప్రయాణం కానున్నారు.

చంద్రబాబు రాగానే అమరావతి చేరుకొని పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నం చేస్తారని సమాచారం. గత ఎన్నికలలో కేవలం 0.85% ఓట్లు సాధించిన పార్టీకు నాయకులు క్యూ కట్టడం విశేషం. బీజేపీ తరపున ఎమ్మెల్యేగా కానీ, ఎంపీగా కానీ పోటీ చేసిన ఒక్కరు కూడా డిపాజిట్ దక్కించుకోకపోవడం విశేషం. అయితే వచ్చే ఎన్నికలలో కేంద్రప్రభుత్వ ప్రోద్బలంతో బాగా పెరిగి అధికారపక్షంతో ఢీ కొట్టే పరిస్థితి ఉంటుందా లేక ఐదు సంవత్సరాలు తలదాచుకుని ఆ తరువాత ఎవరి దారి వారు చేసుకుంటారా అనేది చూడాలి.

ADVERTISEMENT
Latest Stories