మిస్సిస్సిప్పిలో క్రూయిజ్ మునక.. ఇది మరో టైటానిక్ ఘటనే కానీ

Cruise ship sinking in Mississippi River after collision

టైటానిక్ సినిమా అందరూ చూసే ఉంటారు. దానిలో కెప్టెన్ పొరపాటు వలన భారీ మంచు పర్వతాన్ని ఢీ కొని టైటానిక్ మునిగిపోతుంది. అమెరికాలో అటువంటిదే మరో ఘోర ప్రమాదం జరిగింది. అయితే ఈ సారి మిస్సిస్సిప్పి నదిలో అలాంటి ప్రమాదం జరిగింది.

అమెరికాలోని లూసియానా రాష్ట్రంలోని న్యూ ఓర్లీన్స్ పోర్టు వద్ద మిస్సిస్సిప్పి నదిలో లంగరు వేసున్న ‘అమెరికన్ హెరిటేజ్’ అనే భారీ క్రూయిజ్‌ శుక్రవారం మధ్యాహ్నం సుమారు 12:30 గంటల సమయంలో నదిలో మునిగి పోయింది. పోర్టుకు వస్తున్న ‘అట్లాంటిక్ ఆస్ఫాల్ట్’ అనే భారీ ట్యాంకర్ నౌక అదుపు తప్పి క్రూయిజ్‌ను బలంగా ఢీకొట్టింది. ఆ ధాటికి అంత పెద్ద ఐదు అంతస్తుల క్రూయిజ్ నదిలో ఒక వైపుకు ఒరిగిపోయింది.

ADVERTISEMENT

ఈ ప్రమాదం జరిగినప్పుడు క్రూయిజ్‌లో సుమారు 180 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. వారిలో కొందరు లైఫ్ జాకెట్లు ధరించి నదిలోకి దూకేయగా, మిగిలినవారు కూడా భయంతో నదిలో దూకేశారు.

అయితే ఈ ప్రమాదం పోర్టులో జరిగినందున అక్కడే ఉన్న ఇతర నౌకల సిబ్బంది, కోస్ట్ గార్డ్, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకొని సహాయ చర్యలు చేపట్టి అందరినీ కాపాడారు.

ఈలోగా క్రూయిజ్‌లోకి నీళ్ళు చేరడంతో అందరూ చూస్తుండగానే నదిలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 32 మందికి స్వల్ప గాయాలైనప్పటికీ 180 మంది ప్రాణాలతో బయటపడటం మహాద్భుతమే కదా?

ఈ ప్రమాదంలో క్రూయిజ్ మునిగిపోతున్నప్పుడు అక్కడే ఉన్నవారు తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో ఆ వీడియోలు పోస్ట్ చేయగా, అవి వైరల్ అవుతున్నాయి. ఇది నాటి టైటానిక్ ప్రమాదాన్ని మళ్ళీ గుర్తు చేసిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నిజమే కదా?

ADVERTISEMENT
Latest Stories