భారత్‌ సమ్మిట్: విపక్షాలు వ్యతిరేకం.. రేవంత్‌కు ప్రతిష్టాత్మకం!

Revanth Reddy on Bharat Summit Controversy

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీలాగే తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏ పని చేపట్టినా విమర్శించడానికి బీఆర్ఎస్‌ పార్టీ సిద్ధంగా ఉంటుంది.

విశాఖలో సీఐఐ సదస్సుపై వైసీపీ లేదా దాని సోషల్ మీడియా వారియర్స్ దుష్ప్రచారం చేయగా, తెలంగాణ ప్రభుత్వం నవంబర్‌ 13,14 తేదీలలో హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘భారత్‌ సమ్మిట్‌’కు బిజేపి, బీఆర్ఎస్‌ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కనుక దీనిపై అధికార, ప్రతిపక్షాల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోందిప్పుడు.

ADVERTISEMENT

“ఓ పక్క ప్రజలు, రైతులు నీళ్ళు లేక ఇబ్బందులు పడుతుంటే, కోట్ల రూపాయలు ఖర్చు చేసి భారత్‌ సమ్మిట్ నిర్వహించాల్సిన అవసరం ఉందా?పరిశ్రమలు, పెట్టుబడులు ఆకర్షించడం కోసం ఎలాగూ డిసెంబర్‌లో హైదరాబాద్‌లో గ్లోబల్ సమ్మిట్-2026 నిర్వహిస్తున్నప్పుడు, మళ్ళీ ఇప్పుడే భారత్‌ సమ్మిట్ దేనికి? రాహుల్‌ గాంధీని ‘రీలాంచ్’ చేసేందుకే కదా?తద్వారా ఆయనకు మరింత గుర్తింపు కలిగేలా చేయాలని సిఎం రేవంత్‌ రెడ్డి ఆరాటపడుతున్నారు,” అని బీఆర్ఎస్‌ నేతలు విమర్శిస్తున్నారు.

దీనిపై సిఎం రేవంత్‌ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “రాహుల్‌ గాంధీని రీ లాంచ్ చేయాల్సిన అవసరమే లేదు. ఆయన జాతీయ స్థాయిలో గుర్తింపు కలిగిన గొప్ప నాయకుడు. గత ఎన్నికల సమయంలో ఆయన తెలంగాణ మీదుగా పాదయాత్ర చేస్తేనే బీఆర్ఎస్‌ పార్టీ ఓడిపోయింది. అందుకే కేటీఆర్‌ ఆయనను చూసి భయపడి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు,” అని సిఎం రేవంత్‌ రెడ్డి ఘాటుగా సమాధానం ఇచ్చారు.

‘భారత్‌ సమ్మిట్’ పేరుతో కాంగ్రెస్‌ ప్రభుత్వం భారీగా ప్రజాధనం దుబారా చేస్తోంది. దీని వలన ఎటువంటి ప్రయోజనమూ ఉండదని” కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ ఆరోపించారు.

ఈ వ్యాఖ్యలపై సిఎం రేవంత్‌ రెడ్డి స్పందిస్తూ, “బిజేపి, బీఆర్ఎస్‌ పార్టీ దొందూ దొందే. వాటికీ వాటి రాజకీయ ప్రయోజనాలు తప్ప రాష్ట్రాభివృద్ధి అవసరమే లేదు. అందుకే రాహుల్‌ గాంధీ పర్యటన పేరుతో రాజకీయాలు చేస్తున్నాయి.

ఈ సదస్సుకు వస్తున్న పలువురు విదేశీ ప్రతినిధులకు కేంద్ర ప్రభుత్వం వీసాలు ఇవ్వకుండా అడ్డుపడింది. రాష్ట్రంలో కిషన్ రెడ్డి, బండి సంజయ్‌ ఇద్దరు కేంద్ర మంత్రులున్నారు. వారు రాష్ట్రానికి కొత్తగా ఒక్క పరిశ్రమ, పెట్టుబడి తేలేకపోయారు. కానీ రాష్ట్రాభివృద్ధి కోసం మేము చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుపడటం చాలా దురదృష్టకరం,” అని సిఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.

ADVERTISEMENT
Latest Stories