హీరోయిన్ వెంట పడుతున్న తారక్!

Positive-Sign-for-Aravindha-Sametha-USA-Premiersఅగ్ర హీరోలు హీరోయిన్ల వెంటపడే సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంటాయి. రెగ్యులర్ గా ఎప్పుడూ హీరోయిన్లు అగ్ర హీరోల వెంటపడే సీన్లే ఉంటాయి. అందుకు విభిన్నంగా ‘దూకుడు’లో మహేష్ సమంత వెంటపడే సీన్లు ఎలా పండాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా “అరవింద సమేత”లో అదే పని చేసినట్లు కనపడుతున్నారు.

[m9adh]

ADVERTISEMENT

‘అనగనగనగా’ పాటకు సంబంధించిన విడుదల చేసిన వీడియో ప్రోమోలో జూనియర్ ఎన్టీఆర్ హీరోయిన్ పూజా హెగ్డే వెంటపడుతున్నట్లుగా కనపడుతోంది. ‘అరెరెరె… అరవిందట తన పేరు’ అంటూ తారక్ హీరోయిన్ పేరును ఆలపిస్తూ సాగిన ఈ పాటలో రెగ్యులర్ తారక్ స్టెప్స్ కంటే కూడా, హీరోయిన్ ను ఫాలో అవుతూ చేసిన హంగామా బాగుంది. బహుశా సిల్వర్ స్క్రీన్ పై ఈ పాట మరింతగా పడుతుందనిపించే విధంగా ఉంది.

ADVERTISEMENT
Latest Stories