ఇది చాలదూ… ఏ ముఖ్యమంత్రి ఎటువంటివారో అర్థం చేసుకునేందుకు?

Anant Ambani: ‘Consider Me a Son of Andhra Pradesh’

నేడు మదనపల్లిలో జరిగిన రాయలసీమ ఉద్యాన హబ్, దేశంలో మొట్ట మొదటి ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్’ శంకుస్థాపన కార్యక్రమ సభలో పాల్గొన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ చేసిన ప్రసంగం, అయన నడవడిక చూసి వేదికపై ఉన్నవారే కాదు.. సభకు వచ్చిన ప్రజలు కూడా మెచ్చుకోకుండా ఉండలేకపోయారంటే అతిశయోక్తి కాదు.

“నన్ను మీ ఆంద్ర బిడ్డగా భావించి, నేను మీకు ఏవిధంగా సహాయపడగలనో చెప్పండి. నా శక్తిమేర సాయపడతా. ఆంధ్రప్రదేశ్‌ డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ నేతృత్వంలో జరుగుతున్న గ్రామీణాభివృద్ధి గురించి తెలుసుకొని నాకు చాలా సంతోషం కలుగుతోంది.

ADVERTISEMENT

ఇదివరకు సిఎం చంద్రబాబు నాయుడుగారు ఐఎస్‌బీ స్కూల్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఐఎస్ఎ ఏర్పాటు చేయాలని మమ్మల్ని కోరారు. ఆయన కోరినట్లే ఇక్కడ ఐఎస్ఎ ఏర్పాటు చేస్తున్నాము.

ఎప్పటికప్పుడు అందివస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూనే దానిని వ్యవసాయానికి కూడా వినియోగించుకోవాలి. అప్పుడే దేశంలో వ్యవసాయ రంగం కూడా మిగిలిన రంగాల్లా శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. ఈ విషయం సిఎం చంద్రబాబు నాయుడు గారు గ్రహించారు. కనుకనే ఇటువంటి ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు.

ఏపీ ప్రభుత్వం ఈజ్ అండ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం ప్రవేశపెట్టిన తర్వాత ఈ రెండేళ్ళలో రూ.14 లక్షల కోట్లు విలువగల 388 ప్రాజెక్టులు ఆంధ్రాకు తరలివచ్చాయి. ఇంకా అనేక ప్రాజెక్టులు రాబోతున్నాయి. వీటన్నిటితో లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి లభిస్తుంది. భవిష్యత్‌లో ఆంద్రభూమి సువర్ణభూమిగా మారబోతోంది,” అంటూ అనంత్ అంబానీ చేసిన ప్రసంగం రోటీన్ ఉపన్యాసం కాదు.

దేశంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి పేరుమోసిన అతిపెద్ద సంస్థను నడుపుతున్న ఓ వ్యాపార వేత్తగా, పారిశ్రామిక వేత్తగా అయన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పనితీరు, పాలకుల ఆలోచనా సరళి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనే వారి తపన, నిబద్దత, ఆ కారణంగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మద్య బలమైన సంబంధాలు వంటి అనేక అంశాలను నిశితంగా గమించిన తర్వాత ఆయన మనసులో నుంచి వచ్చిన మాటలు ఇవి.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే, సభ ముగిసిన తర్వాత అయన సిఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పాదాలు తాకి నమస్కరించడం మరో ఎత్తు. ఇది అయన వ్యక్తిత్వానికి నిదర్శనంగా భావించవచ్చు.

సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ ఇద్దరూ కూడా అయన ప్రసంగం, నడవడికకు ముగ్దులై ఆప్యాయంగా కౌగలించుకున్నారు. మీరు మా ఆంద్రా ముద్దు బిడ్డవే అని గర్వంగా చెప్పుకుంటామని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

గతంలో ముఖ్యమంత్రిని చూసి హడలిపోయి పారిశ్రామికవేత్తలు వెనుతిరిగి చూడకుండా పారిపోయేవారు. కానీ రిలయన్స్ సంస్థని నడిపిస్తున్న అనంత్ అంబానీ సిఎం చంద్రబాబు నాయుడి కాళ్ళకు నమస్కరించి “మీ రాష్ట్రానికి నేనేమి చేయాలో చెప్పండి,” అని అడిగారు. ఇది చాలదూ… ఏ ముఖ్యమంత్రి ఎటువంటివారో అర్థం చేసుకునేందుకు?

ADVERTISEMENT
Latest Stories