అనసూయపై చెలరేగిపోవడానికి ఓ వర్గం ఎప్పుడూ కాచుకుని కూర్చుంటుందన్న విషయం మరోసారి ఇంస్టాగ్రామ్ లో నిరూపణ అయ్యింది. “యాత్ర” సినిమాలో ఓ రోల్ చేస్తోన్న అనసూయ, లొకేషన్ లో తాను కూర్చుని ఉన్న ఓ స్టిల్ ను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అనసూయను వెనుక నుండి తీసిన ఈ స్టిల్ లో… అనసూయకు ఎండ తగలకుండా ఓ వ్యక్తి గొడుగు పట్టుకుని నిల్చున్నాడు.
[m9ad]
ఇది గమనించిన ఓ నెటిజన్… ఆ వ్యక్తి అలా ఎన్ని గంటలు మీ ముందు నిల్చోవాలి? అంటూ ప్రశ్నించగా, దానికి అనసూయ సమాధానం ఇస్తూ… మరొకరి కోసం తాను కూడా అలాంటి పనులు చేస్తాను, అది ఎవరు ఎంచుకున్న ప్రొఫెషన్ వాళ్ళది అంటూ సమాధానం ఇచ్చింది. సాధారణంగా అనసూయకు వ్యతిరేకంగా నెటిజన్లు, ఈ సమయంలో మాత్రం అనసూయకు సహకారం అందిస్తూ వ్యాఖ్యలు చేసారు.
ఇందులో అనసూయ తప్పేముంది… అతని విధి నిర్వహణ అతను చేస్తున్నాడు, ఆ మాటకొస్తే ఒక్క అనసూయకే కాదు, చాలామంది సెలబ్రిటీలకు ఇలా ఉంటారు. ఈ ఫోటోలోనే పక్కన ఉన్న నటుడుకి కూడా గొడుగు పట్టుకుని ఉన్న వైనం గమనించవచ్చు అంటూ అనసూయ వాదనను సమర్ధిస్తున్నారు. అలాగే విభేదించే వారు ఎప్పటిలానే అనసూయను టార్గెట్ చేస్తూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు.



