‘జగన్’కు విలువ కట్టలేని ‘ఆస్తులు’ ఉన్నాయా?

YS-Jagan-Andhra-Pradesh-Assembly-speaker-Kodela-Siva-Prasadస్వచ్చంధంగా ఆస్తుల వివరాలను ప్రకటించడం – ప్రత్యర్థి వర్గాలకు సవాలు విసరడం గత కొన్ని సంవత్సరాలుగా చంద్రబాబుకు పరిపాటిగా మారింది. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నపుడే కాదు, ఏపీ సిఎం హోదాలో కూడా చంద్రబాబు వరుసగా రెండు సంవత్సరాలు ఆస్తుల వివరాలను ప్రకటించిన ఇతర రాజకీయ నేతలకు ఆదర్శప్రాయంగా నిలిచారు. అయితే మొత్తం ఏపీలో ఉన్న 175 మంది ఎమ్మెల్యేలలో ఎంత మంది తమ ఆస్తులను ప్రకటించారో స్పీకర్ కోడెల శివప్రసాద్ సోమవారం నాడు వెల్లడించారు.

ఏపీ అసెంబ్లీకి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన మొత్తం 175 మంది ఎమ్మెల్యేలకు గానూ, ఇప్పటివరకు కేవలం 46 మంది మాత్రమే తమ ఆస్తుల వివరాలను అసెంబ్లీకి సమర్పించారని కోడెల తెలిపారు. ఈ జాబితాలో కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందరికన్నా ముందు సమర్పించారని అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నేత హోదాలో ఉండి పులివెందుల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం తన ఆస్తులను వెల్లడించలేదు.

ADVERTISEMENT

ఆస్తులను ప్రకటించని వారి ప్రముఖుల జాబితాలో జగన్ తో ఏపీ క్యాబినెట్ లో ఉన్నటువంటి 13 మంది మంత్రులు కూడా ఉన్నారు. ఇద్దరు డిప్యూటీ సీఎంలు కేఈ కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప సహా కేబినెట్ లో కీలక శాఖలకు మంత్రులుగా ఉన్న యనమల రామకృష్ణుడు, పల్లె రఘునాథరెడ్డి, గంటా శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిశోర్ బాబు, నారాయణ, శిద్ధా రాఘవరావు, కిమిడి మృణాళిని, పైడికొండల మాణిక్యాలరావు, పీతల సుజాత, పరిటాల సునీతలతో పాటు చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు, విప్ చింతమనేని ప్రభాకర్ కూడా తమ ఆస్తులను వెల్లడించలేదు.

అయితే మంత్రుల సంగతి కాసేపు పక్కన పెడితే, రాష్ట్రంలో ప్రధానంగా ఉన్నటువంటి రెండు పార్టీల అధినేతల ఆస్తులు ప్రధానంగా చర్చనీయాంశంగా ఉంటాయి. చంద్రబాబు వ్యక్తిగత ఆస్తుల వివరాలతో పాటు కుటుంబ ఆస్తులను కూడా ప్రకటించేసారు. మరి కనీసం జగన్ తన వ్యక్తిగత ఆస్తులను కూడా ఎందుకు ప్రకటించలేకపోయారు? జగన్ కు తన ఆస్తుల విలువ తెలియదా? లేక విలువ కట్టలేని ఆస్తులు జగన్ సొంతమా? అంటూ నెటిజన్లు వేస్తున్న ప్రశ్నలు కోకొల్లలు. ఒకప్పుడు 80 కోట్లు అడ్వాన్స్ టాక్స్ కట్టి సంచలనం సృష్టించిన జగన్, మరి ఇపుడు ఎందుకు తన ఆస్తులను ప్రకటించలేకపోతున్నారు? అప్పుడు వైయస్ ముఖ్యమంత్రిగా ఉండడమే ఓ కారణమా?

ADVERTISEMENT
Latest Stories