చిలకలూరిపేటలో వైసీపీకి ఎదురుదెబ్బ…పార్టీకా.? రజనీకా.?

Vidadala Rajini Faces Setback as Shaik Karimun Joins TDP

మాజీ మంత్రి విడుదల రజని చిలకలూరి పేట వైసీపీ రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తారు. ఆ నియోజకవర్గం కేంద్రంగా వైసీపీ సాగించే రాజకీయాలకు కర్త, కర్మ, క్రియ అన్ని తానేనట్టుగా వ్యవహరిస్తారు. తనకంటూ ఒక సొంత వర్గాన్ని తయారుచేసుకుని పార్టీ అధికారంలో ఉన్నా విపక్షంలో ఉన్నా చిలకలూరి పేట రాజకీయాలలో తన పట్టు కాపాడుకునేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తుంటారు.

ఏపీలో మొదలైన స్థానిక ఎన్నికల సమరంలో కూడా తన నియోజకవర్గమైన చిలకలూరి పేటలో పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశించినట్టుగా కూటమి ఏకగ్రీవాలకు తావివ్వకుండా వైసీపీ అభ్యర్థి గెలుపు కోసం రజని తన ప్రయత్నాలు తానూ మొదలుపెట్టిన తరుణంలో రజనికి ఊహించని షాక్ ఇచ్చారు కారెమూన్ షేక్.

ADVERTISEMENT

పల్నాడు జిల్లా చిలకలూరిపేట మున్సిపల్ చైర్మన్ గా మాజీ మంత్రి విడుదల రజని ప్రతిపాదించిన కారెమూన్ షేక్ సైలెంట్ గా రాత్రికి రాత్రే పార్టీ జెండా మార్చేశారు. తాజాగా రజని, మహిళా పోలీస్ మధ్య జరిగిన తోపులాటతో రజని కాసేపు తన రాజకీయాన్ని పక్కదారి మళ్లిస్తే ఈ లోపు ఇటు పార్టీకి జరగాల్సిన నష్టం, తనకు జరగాల్సిన అవమానం జరిగిపోయింది.

రజని వర్గం నుంచి వైసీపీ తరుపున చిలకలూరిపేట మున్సిపల్ అభ్యర్థిగా బరిలోకి దిగాల్సిన కారెమూన్ షేక్ వైసీపీ కి హ్యాండ్ ఇచ్చి టీడీపీ కండువా కప్పుకున్నారు. స్థానికంగా కూటమి పొత్తులో భాగంగా ఆ స్థానంలో జనసేన అభ్యర్థి తోట రాజరాజేశ్వరి పోటీలో ఉన్నారు.

ఈ నేపథ్యంలో వైసీపీ అభ్యర్థిగా జనసేన అభ్యర్థి రాజరాజేశ్వరి పై పోటీకి దిగాల్సిన షేక్, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదివారం సాయంత్రం తుది అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే వైసీపీ వీడి టీడీపీ కండువా కప్పుకుని జనసేన అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం మొదలుపెట్టారు.

దీనితో షేక్ తీసుకున్న ఈ నిర్ణయం వైసీపీ పార్టీకి పెద్ద రాజకీయ ఎదురుదెబ్బ తో పాటుగా మాజీ మంత్రి రజని కి కూడా ఇది ఒక రకంగా అవమానకరమైన ఘటనగా చెప్పవచ్చు. తానూ తన మనిషిగా నమ్మి, ప్రతిపాదించిన వ్యక్తి ఇలా పార్టీకి అవసరమైన కీలక సమయంలో పార్టీ ఫిరాయించడం, తనకు కూటమి లో సీటు దక్కకపోయినా కూటమి అభ్యర్థి గెలుపు కోసం ముందుకు రావడం రజనికి ఒకరకంగా ఊహించని షాక్ అనే చెప్పాలి.

ADVERTISEMENT
Latest Stories