ఆంధ్రప్రదేశ్ లో కేబినెట్ విస్తరణ?

YSRCP Government Pitting Poor Against Poor?మార్చి లో ఖాళీ అయ్యే 55 రాజ్య సభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యింది. వీటిలో ఆంధ్రప్రదేశ్ కు నాలుగు, తెలంగాణకు రెండు స్థానాలు ఖాళీ అవ్వబోతున్నాయి. రెండు రాష్ట్రాలలోని అధికార పార్టీలు వీటిని దక్కించుకుంటాయి. ఈరెండు సీట్ల కోసం అధికార రాష్ట్ర సమితి విపరీతమైన పోటీ ఉండటం గమనార్హం.

ఇప్పటికే మూడు సీట్ల పై ముఖ్యమంత్రి జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. మండలి రద్దుతో మంత్రి పదవులు కోల్పోయే… పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలకు రాజ్యసభ పదవులు ఖాయం అయిపోయినట్టు సమాచారం. మూడో సీటు పారిశ్రామికవేత్త అయోధ్య రామిరెడ్డికి వెళ్తుంది.

ADVERTISEMENT

ఇది ఇలా ఉండగా పిల్లి, మోపిదేవి లతో కేబినెట్ లో ఏర్పడే ఖాళీలను భర్తీ చెయ్యడానికి మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది. ఈ నెలాఖరు లోగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగనుండడంతో ఏప్రిల్ లో ఈ ప్రక్రియ ఉండబోతుందని సమాచారం. పదవులు కోల్పోయే ఇద్దరూ బీసీ నేతలు కావడంతో కొత్తగా కేబినెట్ లోకి తీసుకునే వారు కూడా అదే సామాజికవర్గానికి చెందిన వారు అయ్యే అవకాశం ఉంది.

దాంతో బీసీ ఎమ్మెల్యేలు ఆశలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉండగా మంత్రివర్గ విస్తరణ ఆ ఇద్దరి వరకే పరిమితం అవుతుందా లేక ఉన్న మంత్రులలో ఎవరినైనా బయటకు పంపుతారా అనేది చూడాలి. కొంత మంది మంత్రుల పనితీరుపై జగన్ గుర్రుగా ఉన్నారని గత కొంత కాలంగా ప్రచారం జరిగింది.

ADVERTISEMENT
Latest Stories