అలాంటివి బయటపెట్టాలంటే ధైర్యం కావాలి!

andrea jeremiah-హీరోయిన్ గానే కాకుండా మంచి సింగర్ గా కూడా గుర్తింపు పొందిన ఆండ్రియా నటించిన ‘విశ్వరూపం-2’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ… ఈ చిత్రంలో నటించిన తరువాత తనలో సామాజిక బాధ్యత ఎక్కువైందని, ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలకు ఎంతో ధైర్యం అవసరమని ఆండ్రియా తెలిపింది.

[m9ad]

ADVERTISEMENT

నటి శ్రీరెడ్డి వివాదాల గురించి తనను ప్రశ్నిస్తూ ఉంటారని… ఆమె చెబుతున్న వాటిలో నిజం ఉంటే, వాటిని బహిరంగపరచడానికి ఆమెకు ఎంతో ధైర్యం కావాలని చెప్పింది. ఎవరికైనా అలాంటి అనుభవాలు ఎదురైనప్పుడు, వాటిని కచ్చితంగా బయటపెట్టాలని సూచించింది. ఇలాంటి ఘటనలకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని చెప్పింది.

ADVERTISEMENT
Latest Stories