ఎఫ్ 3 సీక్రెట్స్ చెప్పిన అనిల్ రావిపూడి

anil ravipudi about F2 – Fun and Frustration sequelరిటర్న్ అఫ్ ఇన్వెస్ట్మెంట్ బట్టి చూస్తే ఎఫ్ 2 2019లో అతిపెద్ద హిట్ అని చెప్పుకోవాలి. వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన ఈ చిత్రం సంక్రాంతికి విడుదలై దుమ్ము దులిపింది. సంక్రాంతికి విడుదలైన ఎన్టీఆర్ మహానాయకుడు, వినయ విధేయ రామ చిత్రాలంటే బెటర్ గా ప్రేక్షకుల ఆదరణ పొంది 80 కోట్ల పైగా షేర్ కలెక్టు చేసింది.

ADVERTISEMENT

మరోవైపు చిత్రంలోనే ఎఫ్ 2కి సీక్వెల్ గా ఎఫ్ 3 తీయబోతున్నట్టు చిత్ర బృందం అప్పట్లోనే ప్రకటించింది. అందులో రవితేజ నటించవచ్చని అప్పట్లో వార్తలు వచ్చాయి. దానిని ఇప్పటివరకు అధికారికంగా ధృవీకరించలేదు. అయితే వచ్చే సంవత్సరం ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని వార్తలు వస్తున్నాయి.

ఈ క్రమంలో ఈ చిత్రం గురించి అనిల్ రావిపూడి ఆసక్తికర విషయాలు చెప్పాడు. “ఎఫ్3 టోటల్ గా డిఫరెంట్ ప్రపంచం. మొగుడు పెళ్ళాల స్టోరీ కాదు. హీరో హీరోయిన్లు మాత్రమే వారే ఉంటారు. వారి కోరికలు, టార్గెట్స్ వేరుగా ఉంటాయి. అయితే ఎఫ్2 లోని కొన్ని మ్యానరిజమ్స్ మాత్రం కొనసాగుతాయి,” అని ఆయన వివరించాడు.

వెంకటేష్ అసురన్ రీమేక్ షూటింగ్ ఈ నెలలో మొదలు పెడతారు. ఆ సినిమా పూర్తి అవ్వగానే ఎఫ్ 3 మొదలు అవుతుంది. 2021 సంక్రాంతికి ఈ సినిమా విడుదలకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనిల్ రావిపూడి తాజా చిత్రం మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరూ బాక్స్ ఆఫీస్ వద్ద స్ట్రాంగ్ గా ఉంది.

ADVERTISEMENT
Latest Stories