పండగ ముందు అనిల్ రావిపూడికి శుభశకునం

Anil ravipudi blessed with baby boyఇంకో ఐదు రోజులలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ విడుదల కాబోతుంది. గత సంక్రాంతికి ఎఫ్2 వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సంక్రాంతి కి మరో బ్లాక్ బస్టర్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. అయితే ఈ లోగానే అనిల్ కు ఒక శుభ సూచకం కనిపించింది. ఈరోజు ఉదయం ఆయన తండ్రయ్యాడు.

ADVERTISEMENT

అనిల్‌ రావిపూడికి ఈరోజు ఉదయం ఒక అందమైన కుమారుడు జన్మించాడు. దీంతో అనిల్‌ ఇంట్లో సంక్రాంతి పండగ ముందుగానే వచ్చినట్టయింది. కాగా అనిల్‌ రావిపూడి, భావనల జంటకు శ్రేయాస్వి అనే కూతురు ఉంది. కూతురుతో ఆడుకోడానికి మరో బుడతడు వచ్చేయడంతో ఆ ఇంట్లో సంతోషం నెలకొంది.

ఈ సందర్భంగా సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు అనిల్‌ రావిపూడికి అభినందనలు తెలిపాడు. అనిల్‌ రావిపూడి ఇంట్లో చిన్న అనిల్‌ జన్మించడంతో పలువురు సినీప్రముఖులు అనిల్‌కు కంగ్రాట్స్‌ తెలియజేస్తున్నారు. మరోవైపు ఈరోజు సరిలేరు నీకెవ్వరూ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనుంది.

దీనికి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారు. ఈ చిత్రంపై దాదాపుగా 110 కోట్ల బిజినెస్ జరిగింది. జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల కానుంది. అయితే మరునాడే విడుదల అవుతున్న అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో సినిమా నుండి గట్టి పోటీ ఎదురుకోనుంది.

ADVERTISEMENT
Latest Stories