ఏమిటమ్మా అనితా వంగలపూడి… కొడాలి నానిని అంతగా ఉతికేస్తా ఎలా?

Anitha Vangalapudi counter to Kodali Naniటిడిపిలో ఫైర్ బ్రాండ్ మహిళా నాయకులలో వంగలపూడి అనిత అగ్ర స్థానంలో ఉంటారు. ఆమె వైసీపీలో ఎవరిపైనైనా విల్లు ఎక్కుపెడితే ఇక వారి పని అయిపోయినట్లే! అంత నిర్భయంగా సూటిగా వాగ్బాణాలు సందిస్తుంటారు అనిత. ఈరోజు మాజీ మంత్రి కొడాలి నానిని తన మాటలతో చీల్చి చెండాడేశారు ఆమె.

విజయవాడలో పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, “అసలు కొడాలి నాని ఏనాడైనా ఏదైనా సబ్జెక్టుతో మాట్లాడారా? నోరు విప్పితే బూతులు తప్ప ఆయన నోట మరేవీ రావు. నందమూరి హరికృష్ణను మోసం చేస్తే ఆయన తన్ని తగిలేశారు. అయినా కొడాలి సంగతి తెలియక జూ.ఎన్టీఆర్‌ చేరదీస్తే ఆయన పరువు తీస్తుండటంతో జూ.ఎన్టీఆర్‌ కూడా కొడాలిని దూరం పెట్టారు.

ADVERTISEMENT

దాంతో కొడాలి సిఎం జగన్మోహన్ రెడ్డి పంచన చేరి బ్రతుకుతున్నారు. కానీ తనను చేరదీసారన్న కృతజ్ఞత లేకుండా తన ఇసుక దందాలో, లిక్కర్ దందాలో, మైనింగ్ దందాలో ఆయనకు వాటాలు ఇవ్వకుండా మొత్తం తనే నొక్కేస్తుండటంతో జగన్మోహన్ రెడ్డి కూడా ఆయనను మంత్రి పదవిలో నుంచి పీకేసి పక్కన పడేశారు. అప్పుడు కానీ కొడాలి నానికి తన పరిస్థితి తెలిసిరాలేదు.

అందుకే సిఎం జగన్మోహన్ రెడ్డిని ప్రసన్నం చేసుకొనేందుకు మద్యమద్యలో మీడియా ముందుకు వచ్చి నాలుగు బూతులు మాట్లాడుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంటారు. నిజానికి ఇప్పుడు ఆయన డ్యూటీ ఇదొక్కటే. కొడాలి నాని నోటంట ఏనాడైనా ప్రజలకు అర్దమయ్యే ఓ మంచి మాట… లేదా ఏదైనా సబ్జెక్టు గురించి మాట్లాడినా దాఖలాలు ఉన్నాయా?ఇవన్నీ నేను చెపుతున్న మాటలు కావు. ఆయన గురించి జనాలు అనుకొంటున్న మాటలు,” అంటూ కడిగేశారు. ఈ వీడియో చూస్తే అనిత ఆయనను ఏ స్థాయిలో ఉతికేశారో తెలుస్తుంది.

ADVERTISEMENT
Latest Stories