నయనతార రూటులోనే అనుష్క

Anushka Shetty -Nayanatharaచాలా మంది నటీమణులు ఒక 10-15 సినిమాలు చేసి తెరమరుగు అయిపోతారు. కొందరు రెమ్యూనరేషన్ తగ్గించుకుని చిన్న హీరోలతో చేస్తూ రకరకాలుగా తమ కేరీర్ ని పెంచుకోవటానికి తిప్పలు పడతారు. ఎక్కడో ఒకరో ఇద్దరో నయనతార వంటి వారు మాత్రం తెలివిగా కమర్షియల్ సినిమా నుండి తప్పుకుని విభిన్నమైన రూటులో సాగుతూ సెకండ్ ఇన్నింగ్స్ లో బిజిగా ఉంటారు.

తాజాగా అనుష్క కూడా అదే రూటులో వెళ్తున్నట్టుగా ఉంది. బాహుబలిలో అమ్మ పాత్ర చేసిన తరువాత భాగమతి అని వుమన్ ఓరియెంటెడ్ సినిమా లో నటించింది. ఇప్పుడు కమర్షియల్ కానటువంటి నిశ్శబ్దం అనే సినిమాలు వచ్చే నెల 31న విడుదలకు సిద్ధం అవుతుంది. అనుష్క త‌దుప‌రి సినిమా కూడా ఒక థ్రిల్ల‌రే అని తెలుస్తోంది.

ADVERTISEMENT

గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌కత్వంలో ఈ సినిమా రూపొందనుంద‌ట‌. దీనిబట్టి ఇక అనుష్క కూడా నయనతార లాగే కమర్షియల్ సినిమాలు కాకుండా విభిన్నమైన సినిమాలతో ముందుకు వెళ్తుందని అర్ధం చేసుకోవచ్చు. సైజు జీరో కోసం వెయిట్ పెంచిన స్వీటీ ఆ తరువాత తగ్గడానికి తిప్పలు పడుతుంది. ఈ వయసులో మరీ ఎక్కువగా ప్రయత్నించినా ఇబ్బంది అని నిర్ణయించుకుందట. అది కూడా కమర్షియల్ సినిమాలు చెయ్యకపోవడానికి ఒక కారణం అంటున్నారు.

అయితే నయనతార ఇటువంటి సినిమాలు చేసినా ఆమె మార్కెట్ తమిళనాడులో చెక్కుచెదరలేదు. అనుష్క విషయంలో ఏమవుతుందో చూడాలి. ఒకవేళ నిశ్శబ్దం గనుక బాక్స్ ఆఫీసు వద్ద బోల్తా పడితే మాత్రం ట్రేడ్ ఇటువంటి సినిమాలకు మొహం చాటేయ్యవచ్చు. ఈ సినిమా అధికారిక ప్రకటన త్వరలో రాబోతుంది.

ADVERTISEMENT
Latest Stories