‘సైరా’లో మరో క్రేజీ బ్యూటీ!

Anushka Shetty in Sye Raa Narasimha Reddy ‘బాహుబలి’ తర్వాత అంతటి స్థాయిలో తెరకెక్కనున్న సినిమాగా మెగాస్టార్ చిరంజీవి “సైరా నరసింహారెడ్డి” ట్రేడ్ వర్గాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సినిమాకు ఎంపిక చేసిన కాస్టింగ్ ఇప్పటికే దిమ్మతిరిగే రేంజ్ లో ఉండగా, దీనికి మరింత మంది తోడు కానున్నారని తెలుస్తోంది. ‘అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి’ వంటి సినిమాలతో విశేషమైన కీర్తి ప్రతిష్టతలు తెచ్చుకున్న అనుష్క కూడా ఈ సినిమాలో నటిస్తోందన్న సమాచారం హల్చల్ చేస్తోంది.

హార్రర్, ఫాంటసీ, చారిత్రాత్మకం… ఇలా ఏ తరహా ప్రేస్టేజీయస్ ప్రాజెక్ట్ అయినా గానీ అనుష్క లేకుండా అలాంటి సినిమాలను ఊహించుకోలేనంతగా తెలుగు ప్రేక్షకులపై ప్రభావితం చూపింది. అందులో భాగంగానే ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో ఓ కీలకపాత్రలో అనుష్క కనిపించనుందని తెలుస్తోంది. ఇప్పటికే ప్రధాన భామగా నయనతార ఎంపిక కాగా, మరో రెండు పాత్రల కోసం చేస్తున్న అన్వేషణలో ఓ పాత్రలో అనుష్క మెరవనుందని లేటెస్ట్ టాక్.

ADVERTISEMENT

చరిత్ర ప్రకారం ‘సైరా నరసింహారెడ్డి’కి ముగ్గురు భార్యలని, అందులో రెండు అధికారికం కాగా, మరొకటి అనధికారికంగా ఉంటుందని, ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన విషయం. తాజాగా అనుష్క ఎంపిక ఈ అంశాన్ని మరింత బలపరిచేదిగా ఉంది. అందాల బొమ్మ అనుష్క కూడా ‘సైరా’కు తోడయితే, ఇప్పటికే ఉన్న క్రేజ్ మరింత పెరిగినట్లే కదా! ఇప్పటివరకు మెగాస్టార్ సరసన ‘స్టాలిన్’ సినిమాలో ఒకే ఒక్క ఐటెం సాంగ్ లో మాత్రమే కనిపించింది అనుష్క.

ADVERTISEMENT
Latest Stories