ఏపీలో కూటమి…బీజేపీ కి ఆక్సిజన్ గా మారిందా.?

AP alliance strengthens BJP-led NDA

కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వానికి రాజకీయంగా రోజురోజుకి గడ్డుపరిస్థితులు ఎదురవుతున్నాయి. ట్రంప్ టారిఫ్ ల భారం ఒక వైపు, ఇరాన్ – అమెరికా యుద్ధ ప్రభావంతో పెరుతున్న పెట్రోల్, తద్వారా కొండెక్కుతున్న నిత్యావసరాలు మరోవైపు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

ఇక దానికి తోడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన E20 పెట్రోల్ వివాదం, ప్రధాని హోదాలో మోడీ బంగారం కొనుగోళ్ల మీద చేస్తున్న ప్రకటనలు, పతనం దిశగా దూసుకుపోతున్న దేశీయ మార్కెట్లు ఇలా ఎన్డీయే ప్రభుత్వానికి ఎటు చూసినా వ్యతిరేక పవనాలే వీస్తున్నాయి.

ADVERTISEMENT

ఇక నీట్ పరీక్షా పత్రాల లీకేజ్ వివాదం బీజేపీ పార్టీకి పెద్ద రాజకీయ ఎదురుదెబ్బగా మారింది. సీజేపీ కొట్టిన ఈ రాజకీయ దెబ్బ నుంచి బీజేపీ కోలుకునే సరికి తిరిగి కాంగ్రెస్ మిత్రపక్షాలు, కాక్రోచ్లు మరో ఉద్యమంతో ఎన్డీయే ప్రభుత్వం పై దండయాత్ర మొదలుపెట్టారు.

సర్ ప్రక్రియను వ్యతిరేకిస్తూ రాహుల్ నాయకత్వంలో ఇండి కూటమి, అభిజిత్ నేతృత్వంలో కాక్రోచ్ జనతా పార్టీ బీజేపీ పై రాజకీయ పోరాటనికి సిద్ధమయ్యింది. ఇలా ఎన్డీయే ప్రభుత్వానికి రాజకీయంగా ఇంటా బయటా అంతా అనిశ్చితే కనిపిస్తుంది.

ప్రజాస్వామ్య పరిరక్షణ అంటూ ఇండి కూటమి చేస్తున్న నిరసనలు, జెన్ జీ ల పేరుతో సీజేపీ చేపడుతున్న ఉద్యమాలు కలిసి బీజేపీ పై మునుపెన్నడూ లేని రాజకీయ ఒత్తిడిని సృష్టిస్తున్నాయి. ఇటువంటి రాజకీయ క్లిష్ట సమయంలో ఎన్డీయే ప్రభుత్వం ఇంత బలంగా ఉండడానికి ఏపీలో బీజేపీ తీసుకున్న ఒకేఒక్క నిర్ణయం కారణంగా మారింది.

2024 ఏపీ సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ, జనసేన తో కలిపి కూటమి కట్టేందుకు చివరి నిమిషం వరుకు ఆలోచన చేసిన బీజేపీ ఇప్పుడు ఆ ఒక్క నిర్ణయంతోనే ప్రత్యర్థి రాజకీయ ఒత్తిడుల నుండి సురక్షితంగా ఉండగలుగుతుంది. 2019 లో సొంత బలంతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ కి 2024 లో ఆ స్థాయి గెలుపు సాధ్యం కాలేదు. ఏపీలో టీడీపీ, జనసేన పార్టీలతో బీజేపీ కట్టిన కూటమే మోడీ హ్యాట్రిక్ ప్రధానికి మూలస్తంభం గా నిలిచింది.

నేడు బీజేపీ పార్టీకి రాజకీయంగా ఇంటా బయటా ఎన్ని ఒత్తిడులు ఉన్నప్పటికీ ఏపీలో కూటమి బలంతో కేంద్రంలో ఎన్డీయే స్థిరంగా ఉండగలుగుతుంది అనేది బీజేపీ నేతలు కూడా ఒప్పుకునే వాస్తవమే. అయితే ఆ బలమే ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి, అంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి, దేశ రాజకీయ స్థిరత్వానికి పునాదులుగా మారాయి అనేది కాదనలేని సత్యం.

ADVERTISEMENT
Latest Stories