
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో అనూహ్యంగా ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’ అంశం ప్రధాన అజెండాగా మారడంతో వైసీపి అభ్యర్ధులు టిడిపి, జనసేనలకు, ప్రజలకు జవాబు చెప్పుకోలేక తమ అధినేత జగన్మోహన్ రెడ్డిని తిట్టుకునే పరిస్థితి ఏర్పడింది.
కానీ ఇది రెవెన్యూశాఖ అధికారులు వ్రాసిన ఓ మెమో మాత్రమేనని, దానికి టిడిపి, జనసేనలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటూ వక్రభాష్యం చెప్పి దుష్ప్రచారం చేస్తున్నాయని వాదిస్తూ వైసీపీ నేతలు దీనిని తేలికగా కొట్టి పడేయాలని ప్రయత్నించడం ప్రజలందరూ చూశారు.
కానీ తమ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయబోతున్న మాట వాస్తవమే అని సిఎం జగన్మోహన్ రెడ్డి స్వయంగా రోడ్ షోలో ధృవీకరించారు. అయితే ఇదంతా రైతులకు మేలు చేసేందుకే అని నమ్మబలికారు.
భూ క్రయవిక్రయాల ప్రక్రియ మొత్తం అనేక లోపాలు, లొసుగులతో నిండి ఉందని, వాటి వలన దశాబ్ధాలుగా రైతుల నష్టపోతూనే ఉన్నారని, కనుక ఇకపై రాష్ట్రంలో ఏ ఒక్క రైతు నష్టపోకూడదనే మంచి ఉద్దేశ్యంతోనే ఎంతో ఆలోచించి దీనిని తీసుకువచ్చానని జగన్మోహన్ రెడ్డి స్వయంగా చెప్పారు. మీ ఈ బిడ్డ మేకు మేలు చేస్తాడే తప్ప అన్యాయంగా మీ భూములు గుంజుకోడని జగన్ సెల్ఫ్ సర్టిఫై చేసుకున్నారు.
దీంతో ఇంతకాలం ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై బుకాయిస్తున్నా వైసీపి నేతలు, అభ్యర్ధులు జగన్ స్వయంగా అది నిజమే అని చెప్పడంతో అందరూ తలలు పట్టుకుంటున్నారు. ఇన్నిరోజులుగా తాము ప్రజలకు ఏదోవిదంగా నచ్చజెప్పుకొని ఈ ఎన్నికలలో ఒడ్డున పడదామని ప్రయత్నిస్తుంటే, తమ అధినేత జగన్మోహన్ రెడ్డి స్వయంగా దీని గురించి మాట్లాడి, ప్రతిపక్షాల కంటే దారుణంగా తమను దెబ్బతీస్తున్నారని వైసీపి అభ్యర్ధులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
టిడిపి, జనసేనలు ఈ అవకాశాన్ని బాగానే అందిపుచ్చుకున్నాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఇంతకాలం తాము చెపుతున్నదే నిజం అయ్యిందని వాదిస్తున్నారు.
టిడిపి యువనేత నారా లోకేష్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ, “జగన్మోహన్ రెడ్డి ప్రతీరోజూ ‘నేను మీ బిడ్డని… మీ బిడ్డని…‘ అని ఎందుకు చెపుతారంటే, రేపు మీ ఆస్తిలో వాటా కోసమే. రేపు మీ పొలాలన్నీ తీసేసుకొని అవన్నీ మీ బిడ్డనైనా నావే అని అంటాడు. అందుకే ఇప్పుడే మీ పాసు పుస్తకాల మీద తన ఫోటో వేసుకుంటున్నాడు.
నిన్న మొన్న వరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వంటిది లేనే లేదని వైసీపి నేతలు వాదించారు. కానీ ఉందని జగన్మోహన్ రెడ్డి స్వయంగా చెప్పారు కదా?
అయినా తల్లికి, చెల్లికే న్యాయం చేయని జగన్మోహన్ రెడ్డి, మీ అందరి కోసం పరితపించిపోతున్నారని, మీకు ఏదో న్యాయం చేసేయాలని అనుకుంటున్నారంటే నమ్ముతారా? ఆయనను నమ్మి మీరు మోసపోతారా?” అని నారా లోకేష్ ప్రశ్నించారు.
ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌తో జగన్ ఎవరినో దెబ్బ కొట్టాలని చూస్తే చివరికి అది ఈవిదంగా ఎన్నికలలో వైసీపినే దెబ్బ తీసేలా ఉంది. ఓ మై గాడ్… ఉన్నావా… ఏమిటీ స్క్రిప్ట్?
Vijay Deverakonda’s Ranabaali is heading towards release with a big overseas target, but the early…
After missing its October 9 release, Venkatesh and Trivikram’s Aadarsha Kutumbam AK47 was reportedly heading…