
ఈసారి ఏపీలో శాసనసభ, లోక్‌సభ ఎన్నికలను పేదలకు, పెత్తందారులకు మద్య జరిగే ‘క్లాస్ వార్’ అని జగన్ పదేపదే చెపుతున్నారు. అయితే ఏ ఎన్నికలైనా రెండు విధానాలు లేదా రెండు భిన్నమైన ఆలోచనల మద్య జరుగుతుంటాయి. చాలా అరుదుగా క్లాస్ వార్ జరుగుతుంది.
అసలు జగన్ ‘పెత్తందారులని’ ఎందుకు అంటున్నారో అందరికీ తెలుసు. రాష్ట్రంలో ధనవతులైన కమ్మ సామాజిక వర్గానికి టిడిపి ప్రాతినిధ్యం వహిస్తోంది కనుక వారిని ఆ కులం పేరుతో విమర్శించలేక ‘పెత్తందారులు’ అనే కొత్త పేరు పెట్టిన్నట్లు చెప్పుకోవచ్చు.
టిడిపిపై జగన్ ‘పెత్తందారుల ముద్ర’ వేసేశారు కనుక తనను తాను పేదలకు ప్రతినిధిగా ప్రకటించేసుకున్నారు. కనుక ఈ యుద్ధాని ‘క్లాస్ వార్’ అని చెప్పుకొంటున్నారు.
పేదలకు ప్రతినిధి పేదవాడే అయ్యుండాల్సిన అవసరం లేదు. కానీ వేలకోట్లు ఆస్తులు కలిగి విలాసవంతమైన జీవితం గడుపుతున్న వ్యక్తికి పేదల కష్టాలు ఎలా తెలుస్తాయి? తెలియనప్పుడు పేదలకు ప్రతినిధి ఎలా అవుతాడు?అని ప్రశ్నించేవారు ఎవరూ లేరు. కనుక హెలికాఫ్టర్‌లో తిరుగుతున్న తాను పేదలకు అసలు సిసలైన ప్రతినిధినని జగన్మోహన్ రెడ్డి నిసంకోచంగా చెప్పుకోగలుగుతున్నారు.
ఈ పేదల ప్రతినిధి నిజంగా పేదల కోసం పెత్తందారులతో యుద్ధం చేస్తున్నారా?అని ప్రశ్నించుకుంటే కాదనే సమాధానం కనబడుతుంది. కేవలం పేదల జీవితాలలో మార్పు తేవడం కోసమే ఈ సంక్షేమ పధకాలు ఇవ్వడం లేదు. ఇచ్చినా వాటితో మార్పు రాదని జగన్‌కి కూడా బాగా తెలుసు.
కనుక వాటితో లబ్ధి పొందే వారందరూ ఈ ఎన్నికలలో వైసీపికి ఓట్లు వేస్తారని ఆశతో ఇస్తున్నారు. చేసిన మేలు మరిచిపోవద్దనే జగన్ విన్నపాలు, వేయకపోతే కబడ్దార్ అనే వైసీపి నేతల బెదిరింపులను గమనిస్తే ఈ పధకాలన్నీ ఓట్ల కోసమే పంచుతున్న తాయిలాలని అర్దమవుతుంది. మరి జగన్ దీన జన బాంధవుడు ఎలా అవుతారు?
ఈ పేదల ప్రతినిధి నిజంగా పేదల కోసమే పెత్తందారులతో యుద్ధం చేస్తున్నారా? అంటే అది కూడా కాదనే అందరికీ తెలుసు. ఎప్పటికైనా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలనే తన కలను ‘ఒక్క ఛాన్స్’తో నెరవేర్చుకున్నారు. మరో ఛాన్స్ ఇస్తే మరో 25-30 ఏళ్ళు మేమే పాలిస్తామని స్వయంగా చెప్పుకొంటున్నారు.
కనుక జగన్ తన పదవి, అధికారం చేజారిపోకుండా కాపాడుకోవడానికే పోరాడుతున్నారు తప్ప పేదల కోసం కాదని స్పష్టమవుతోంది. కానీ చెప్పేవాడికి వినేవాడు లోకువ కనుక తాను పేదవాడినని, తాను చేస్తున్నది ‘క్లాస్ వార్’ అని చెప్పుకొంటున్నారు. మరో 15 రోజులు ఏమి చెప్పినా వినాల్సిందే… నమ్మాల్సిందే!
Vijay Deverakonda’s Ranabaali is heading towards release with a big overseas target, but the early…
After missing its October 9 release, Venkatesh and Trivikram’s Aadarsha Kutumbam AK47 was reportedly heading…